కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే అభివృద్ధి
గోదావరిఖని: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధిని మ రింత వేగవంతం చేస్తామని రామగుండం ఎమ్మె ల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. రామగుండం నగరంలో శనివారం జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. త్వరలోనే సింగరేణి ఆస్పత్రిలో కార్డియాలజీ అందుబాటులోకి వస్తుందని, తద్వారా గుండెపోటు బాధితులకు సకాలంలో చికిత్స అందుతుందని తెలిపారు. మాజీ మేయర్ బంగి అనిల్‌కుమార్, నాయకులు మహంకాళి స్వామి, ము స్తాఫా తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆర్జీ–2 ఏరియా ఓసీపీ–3లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందన్నారు. కారు ణ్య నియామకాలు, మారుపేర్ల సమస్య, కార్మికు ల సొంతింటి పథకం, పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ తదితర సమస్యలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని ఆయన అన్నారు. నాయకులు గుండేటి రాజేశ్, శంకర్‌నాయక్, మారెల్లి రాజిరెడ్డి, కొత్త సత్యనారాయణరెడ్డి, ఆకుల రాజిరెడ్డి, దశరథం, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్


