గతపాలకులు భ్రష్టుపట్టించారు
పెద్దపల్లి: గత పాలకులు సుల్తానాబాద్ మున్సిపల్‌ను భ్రష్టు పట్టించారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ధ్వజమెత్తారు. సుల్తానాబాద్ రెండోవార్డు అభ్యర్థి గాజుల రాజమల్లయ్య, మూడోవార్డు అభ్యర్థి మహమ్మద్ నిషాద్‌కు మద్దతుగా ఎమ్మెల్యే మంగళవారం ప్రచారం చేశారు. మేజర్ పంచాయతీ నుంచి మున్సిపల్‌గా ఆవిర్భవించిన సుల్తానాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందాల్సిన ఉన్నా.. గతపాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలోనే రూ.20 కోట్లతో సుల్తానాబాద్‌ను అభివృద్ధి చేశామని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. నాయకులు అన్నయ్యగౌడ్, ప్రకాశరావు, మహేందర్, ఐల రమేశ్, శ్రీగిరి శ్రీనివాస్, బిరుదు కృష్ణ, అంతటి పుష్పలత, దుగ్యాల సంతోష్‌రావు, పెగడ పరుషరాములు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు


