విజన్ ఉన్నవారికే ఓటు
● నిజాయతీ, నిబద్ధత ఉన్నవారికే పట్టం ● సమస్యలపై అవగాహన ఉన్నవారినే ఆదరించాలి ● ‘సాక్షి’ డిబేట్‌లో పట్టణవాసుల అభిప్రాయాలు
కోతుల బెడద తీర్చండి
స్కూల్‌కు వెళ్తున్న విద్యా ర్థుల వెంటపడి కోతులు టిఫిన్ బాక్స్‌లు ఎత్తుకెళ్తున్నాయి. కూరగాయలకు వెళ్లే మహిళలపై దాడులు చేస్తున్నాయి. కోతుల నుంచి కాపాడాలి.
– సయ్యద్ తాజ్, మూడోవార్డు
పనులు చేసేవారికే ఓట్లు
ఐదోవార్డుకు రోడ్డు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. పనులు చేయించేలా చొరవ తీసుకోవాలి. మాటలు చెప్పేవారికి కాకుండా పనులు చేసేవారిని ఎన్నుకోవాలి. – శంకరయ్య, పదోవార్డు
డ్రైనేజీలు క్లీన్ చేయడం లేదు
డ్రైనేజీలు రోజూ క్లీన్ చేయడం లేదు. ఇంట్లోకి దుర్వాసన వస్తుంది. రోజూ శుబ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి.
– హనుమంతు, రిటైర్డ్ ఉద్యోగి, 23వవార్డు
రోజూ ఫాగింగ్ అవసరం
విషజ్వరాలు రాకుండా మున్సిపల్ సిబ్బంది, అధికారులు రోజూ ఫాగింగ్ చేయాలి. ప్రజలకు జ్వరం రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదే. నిజాయతీతో పనిచేసేవారినే గెలిపించాలి.
– కొట్టే లక్ష్మయ్య,
వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్.
పార్క్ స్థలం కాపాడాలి
పమా వార్డులో పార్క్ ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఆ స్థలంపై పాలకులు దృష్టి పెట్టకపోతే కబ్జా అయ్యే అవకాశం ఉంది. పార్క్ స్థలం చుట్టూ హద్దులు ఏర్పాటు చేయాలి. వసతులు కల్పించాలి.
– బుచ్చిబాబు, 23వవార్డు
సాక్షి,పెద్దపల్లి/పెద్దపల్లి: వార్డుల్లోని సమస్యలపై అవగాహన, ప్రణాళికతో అభివృద్ధి చేసే విజన్ ఉన్న నేతలకే ఓటు వేస్తామని పెద్దపల్లి పట్టణ ప్రజలు అన్నారు. జిల్లా కేంద్రంలో ‘సాక్షి’ నిర్వహించిన చర్చా వేదికలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, పలువురు ప్రముఖులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్థానికులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారి మాటల్లోనే..
అభివృద్ధి బాధ్యత నాదే
పెద్దపల్లిలో ఆర్టీసీ బస్సు డిపో కల నేర్చిన. బైపాస్, రాఘవపూర్‌లో కోర్టు భవనం నిర్మిస్తాం. పట్టణ అభివృద్ధికి రూ.100 కోట్లు వెచ్చించాం. ప్రభుత్వ ఆస్పత్రిలో అనేక రకాల వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. త్వరలోనే ఐటీ హబ్ వస్తుంది. నన్ను చూసి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయండి. అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వండి.
– విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి
సమస్యలు పరిష్కరించాలి
మున్సిపల్‌లో విలీనమైన తర్వాత రంగంపల్లిలో వసతులు కల్పిస్తున్నారు. ఇది ఇంకా వేగంగా సాగాలి. సమస్యలు పరిష్కరించే వారికే ఓటువేయాలి.
– ఓదెలు యాదవ్, 11వ వార్డు, రంగంపల్లి
బైపాస్ నిర్మించాలి
బైపాస్ రోడ్డు నిర్మాణంలో వేగం పెంచాలి. తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు నియింత్రించాలి. పనుల్లో వేగం పెంచాలి.
– ప్రసన్నకుమార్, రెండోవార్డు
వసతుల కల్పనపై దృష్టి
ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం. అన్నికాలనీల్లో డ్రైనేజీలు, సీసీరోడ్లు నిర్మిస్తాం. వీధిలైట్లు, పారిశుధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తాం. – నూగిల్ల మల్లయ్య చైర్మన్ అభ్యర్థి
మైదానం అభివృద్ధి చేయాలి
ఐటీఐ గౌండ్‌లోని వాకర్స్ అసోసియేషన్‌లో 300 మందికి సభ్యత్వం ఉంది. ట్రాక్‌కోర్టు ఏర్పాటు చేయాలి. మా సమస్య పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ముందుకు రావడం శుభపరిణామం.
– వెంకట్‌రెడ్డి, మూడోవార్డు
డ్రైనేజీలు శుభ్రం చేయాలి
రోజూ డ్రైనేజీ శుభ్రం చేస్తే దోమల బెడద ఉండదు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం సరిగా పనిచేయడంలేదు. కొన్నిచోట్ల లైట్లు వెలగడంలేదు. కొత్త పాలకవర్దం దీనిపైనే ఫోకస్ చేయాలి. – రంగు శ్రీనివాస్, 14వవార్డు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు
విజన్ ఉన్నవారికే ఓటు


