మరో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
పెద్దపల్లి: వచ్చేమార్చి నాటికి జిల్లాలో మరో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఆయిల్‌పామ్ సాగుపై ఆయన శుక్రవారం సమీక్షించారు. ప్రస్తుతం 525 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బేస్‌మెంట్‌ను ఈనెల 28 వ తేదీవరకు పూర్తిచేయాలని ఆదేశించారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా వ్య క్తిగత మరుగుదొడ్లు మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలన్నారు.
23లోగా సీఎంఆర్ ఇవ్వాలి
రైస్‌మిమిల్లరు ఈనెల 23లోగా సీఎమ్మార్ పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సకాలంలో సీఎమ్మార్ డెలివరీ చేయని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ వేణు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ప్రభాకర్, అధికారులు శ్రీనాథ్, శ్రీకాంత్, జగన్మోహన్‌రెడ్డి, మహేశ్, రాజేశ్వర్‌రావు, భావ్‌సింగ్, గంగాధర్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


