పోలింగ్ సిబ్బంది సహకరించాలి
జ్యోతినగర్(రామగుండం): మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు. ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రెండోవిడత శిక్షణ తరగతులు శుక్రవారం నిర్వహించారు. ఓటరు ఒరిజినల్ గుర్తింపు కార్డు పరిశీలించిన తర్వాతే ఓటు వేయడానికి అనుమతించాలని సూచించారు. ట్రైనర్లు కేడం శ్రీనివాస్, జె.శ్రీనివాస్, అవగాహన కల్పించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఆఫీసర్ ఆంజనేయులు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్‌ఐ శంకర్‌రావు పాల్గొన్నారు.


