మహిళల భద్రతకు భరోసా | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు భరోసా

Feb 6 2026 7:30 AM | Updated on Feb 6 2026 7:30 AM

మహిళల

మహిళల భద్రతకు భరోసా

గోదావరిఖని(రామగుండం): మహిళల భద్రతకు భరోసాగా షీటీంలు నిలుస్తున్నాయని, నిర్భయంగా మహిళలు ఫిర్యాదు చేయవచ్చని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా కోరారు. వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. కమిషనరేట్‌ పరిధిలో పెద్దపల్లి జోన్‌లో ఒక షీ టీం పనిచేస్తోందని, 63039 23700 వాట్సాప్‌, 87126 59386 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, డయల్‌ 100కు కాల్‌ చేయవచ్చన్నారు. జనవరిలో షీటీంలకు 56 ఫిర్యాదులు అందా యని, వాటిలో 13 ఫిర్యాదులపై ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, 8 పెట్టీ కేసులు, నలుగురికి కౌన్సెలింగ్‌ నిర్వహించామని పేర్కొన్నారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

గోదావరిఖని(రామగుండం): సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి గోదావరిఖని వన్‌టౌన్‌ పరిధిలోని పవర్‌హౌస్‌కాలనీ, సప్తగిరికాలనీ, గంగానగర్‌, జీఎంకాలనీ, విద్యానగర్‌, రాంనగర్‌, తదితర సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఏసీపీ రమేశ్‌తో పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీఐ ఇంద్రసేనారెడ్డి, తదితరులున్నారు.

ఎన్నికల నియమావళిపై అవగాహన

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మున్సిపాలిటీ వార్డు స్థానాలకు పోటీపడుతున్న అభ్యర్థులకు గురువారం ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. 36 వార్డులకు 157మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అనుసరించాల్సిన పద్ధతులపై పరిశీలకులు పద్మజరాణి, సుజాత వివరించారు. కమిషనర్‌ వెంకటేశ్‌, టీపీవో నరేశ్‌, వినయ్‌కిరణ్‌, మాస్టర్‌ ట్రేనర్‌ కృష్ణారెడ్డి, ఏవో నాగవేణి తదితరులున్నారు.

ఓటర్లకు స్లిప్పులు అందించాలి

జ్యోతినగర్‌(రామగుండం): రామగుండం కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో ఓటర్లకు స్లిప్పులు అందించాలని కమిషనర్‌ జె. అరుణశ్రీ అన్నారు. గురువారం ఎన్టీపీసీ పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లోని కాకతీయ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటరు స్లిప్పు పంపిణీ చేసినప్పుడు పోలింగ్‌ కేంద్రం చిరునామా తెలియజేయాలని సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది మాత్రమే ఇళ్లకు వెళ్లి స్లిప్పులు పంపిణీ చేయాలని, ఇతరులకు ఇవ్వరాదని ఆదేశించారు. ఎన్నికల పరిశీలకులు పద్మజారాణి, సుజాత, అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఎంఈవో మల్లేశం, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్‌ నవీన్‌, ట్రైనర్లు పాల్గొన్నారు.

డీఎల్‌పీవో విచారణ

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం అప్పన్నపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గురువారం డీఎల్‌పీవో దేవకీదేవి విచారణ జరిపారు. మాజీ ఉపసర్పంచ్‌ చీకటి పోచాలు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.6లక్షల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై మాజీ కార్యదర్శి శ్రీనివాస్‌, ప్రస్తుత కార్యదర్శి శ్రీలతతో పాటు పలువురిని డీఎల్‌పీవో విచారించారు. ఇరువర్గాల వాదనలు విన్న సంబందిత రికార్డులు తెప్పించాలన్నారు. అయితే విచారణ సమయంలో అవసరమైన రికార్డులు అందుబాటులో లేకపోవడంతో నాలుగురోజుల్లో సిద్ధంగా ఉంచాలని డీఎల్‌పీవో ఆదేశించారు.

మహిళల భద్రతకు భరోసా1
1/4

మహిళల భద్రతకు భరోసా

మహిళల భద్రతకు భరోసా2
2/4

మహిళల భద్రతకు భరోసా

మహిళల భద్రతకు భరోసా3
3/4

మహిళల భద్రతకు భరోసా

మహిళల భద్రతకు భరోసా4
4/4

మహిళల భద్రతకు భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement