అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లి: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులు 2026–28 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న అక్రిడిటేషన్‌కార్డుల గడువు ఈనెల 28వ తేదీతో ముగియనుందన్నారు. ఈక్రమంలో కొత్తకార్డుల కోసం సమాచార, పౌర సంబంధాల అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ద రఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 9న ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవు తుందని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
మోనా.. ‘బంగారం’
కోల్‌సిటీ(రామగుండం): సింగరేణి ఉద్యోగి కైలాస లక్ష్మీ కాంతారావు–సంధ్యారాణి దంపతుల కూతు రు కై లాస మోనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్‌లో యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. శనివారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో నిర్వహించిన స్నా తకోత్సవంలో వైస్ చాన్సలర్ పి.కిషన్‌కుమార్‌రెడ్డి గోల్డ్ మెడల్‌తోపాటు పట్టా అందజేశారు. విఠల్‌నగర్‌కు చెందిన మోనా.. హుజూరాబాద్‌లోని ఓ ఇంజి నీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్ పూర్తిచేసింది. ఆమె తండ్రి లక్ష్మీకాంతారావు సింగరేణి ఆర్జీ–3 ఓసీపీ–2లో డ్రైవర్.


