ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టించిన వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టించిన వ్యక్తి అరెస్ట్‌

Feb 4 2026 6:59 AM | Updated on Feb 4 2026 6:59 AM

ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టించిన వ్యక్తి అరెస్ట్‌

ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టించిన వ్యక్తి అరెస్ట్‌

జగిత్యాలక్రైం: ఆన్‌లైన్‌ యూబెట్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాలలోని అంగడిబజార్‌కు చెందిన కట్కం చంద్రశేఖర్‌ను పట్టణానికి చెందిన వేముల మల్లికార్జున్‌ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని యూబిట్‌ ట్రేడింగ్‌ యాప్‌లో క్రిప్టో కరెన్సీ ద్వారా గొలుసుకట్టు వ్యాపారంలో రూ.20 లక్షలు పెట్టించాడు. మల్లికార్జున్‌తోపాటు, పిల్లి కిషన్‌, ధరూర్‌కు చెందిన శివగంగ, యూబెట్‌ కంపెనీ మేనేజర్‌ బ్రిజ్‌ మోహన్‌, సంజయ్‌ గుప్తా కంపెనీ నడిపిస్తున్నారని చెప్పారు. ఇటీవల కంపెనీ మూతపడటంతో తన డబ్బులు చెల్లించాలని చంద్రశేఖర్‌ అడగగా తప్పించుకుతిరుగుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జనవరి ఒకటోతేదీన కేసు నమోదు చేసి మల్లికార్జున్‌ను ధరూర్‌ క్యాంప్‌లోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ కరుణాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement