బర్త్‌డే పార్టీలో యువకులపై దాడి | - | Sakshi
Sakshi News home page

బర్త్‌డే పార్టీలో యువకులపై దాడి

Feb 4 2026 6:59 AM | Updated on Feb 4 2026 6:59 AM

బర్త్‌డే పార్టీలో యువకులపై దాడి

బర్త్‌డే పార్టీలో యువకులపై దాడి

కరీంనగర్‌రూరల్‌: నడిరోడ్డుపై బర్త్‌ డే పార్టీ చేసుకోవడమే కాకుండా కారుపైకి ఎక్కి తల్వార్‌తో కేక్‌ కట్‌ చేసి హంగామా చేసి, ఇరువురిపై దాడి చేసి డబ్బులు,సెల్‌ఫోన్‌ తీసుకున్న తొమ్మిది మందిని మంగళవారం కరీంనగర్‌రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు.. తీగలగుట్టపల్లిలోని హన్మాన్‌నగర్‌లో గత నెల 31న అర్ధరాత్రి 12గంటలకు నడిరోడ్డుపై ఓ మైనర్‌ బర్త్‌ డే పార్టీని యువకులు నిర్వహించారు. కారుపైకి ఎక్కి తల్వార్‌తో కేక్‌ ట్‌ చేయడంతోపాటు టపాసులు కాల్చుతూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేశారు.ఈ సమయంలో టెంట్‌హౌజ్‌ సామగ్రిని వాహనం నుంచి దించుతున్న యుగంధర్‌, చరణ్‌పై కొందరు యువకులు కర్రలు, బండలతో దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ.2వేలతోపాటు సెల్‌ఫోన్‌ తీసుకుని పగులకొట్టారు. స్థానికులు వచ్చి యువకులను అక్కడి నుంచి వెళ్లగొట్టి బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. మరుసటిరోజు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజయ్‌, విఘ్నేష్‌, రంజిత్‌లు మేజర్లు కాగా మిగితా ఆరుగురు మైనర్లున్నారని సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ముగ్గురిని కరీంనగర్‌జైలుకు, ఆరుగురు మైనర్లను వరంగల్‌ జువైనల్‌హోమ్‌కు తరలించినట్లు వివరించారు.

తొమ్మిది మంది అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement