ఓటర్లూ.. ఆత్మసాక్షిగా ఓటెయ్యండి
గోదావరిఖని/పెద్దపల్లిరూరల్: తామిచ్చే హామీలు, పార్టీల మాటలు విని మున్సిపల్ ఎన్నికల్లో ఆత్మసాక్షిగా ఓటు వేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారం, అనంతరం జరిగిన విలేకరుల సమావేశాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ప్రజాపాలన తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కహామీ కూడా నెరవేర్చలేదని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ రాష్ట్రానికి చేసిందేమిలేదని విమర్శించారు. బకాయిల పేరుతో సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దోచుకున్నాయని ఆరోపించారు. సైట్‌విజిట్ పేరుతో రాష్ట్రం ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ, సింగరేణి యాజమాన్యం దోషం ఉందని అన్నారు. సింగరేణి సంస్థకు పర్మినెంట్ సీఎండీని, మంచి డైరెక్టర్లను నియమిస్తామన్నారు. రూ.1,700 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులను సింగరేణి ప్రాంతంలోని పదిజిల్లాలకే చెందేలా చూస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు ఎస్.కుమార్, కందుల సంధ్యారాణి, బల్మూరి వనిత, గుజ్జుల రామకృష్ణారెడ్డి, తూడి రవీందర్, కర్రె సంజీవరెడ్డి, ఠాకూర్ రాంసింగ్, పర్శ సమ్మయ్య, శ్రీనివాసరావు, సదానందం, మోర మంజుల, మనోహర్, శివంగారి సతీశ్, శ్రీనివాస్, రాణీరుద్రమదేవి, గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, కడారి అశోక్‌రావు, సౌదరి మహేందర్ యాదవ్, కామని రాజేంద్రప్రసాద్, కందుల శ్రీనివాస్, కొమ్ము తిరుపతి, మహేశ్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి


