చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Feb 8 2026 4:22 AM | Updated on Feb 8 2026 4:22 AM

చట్టా

చట్టాలపై అవగాహన అవసరం

రామగుండం: రాజ్యాంగం, న్యాయపరమైన అంశాలపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా అడిషనల్‌, సెషన్స్‌ జడ్జి(గోదావరిఖని) జీవన్‌ గ్లోరీ అన్నారు. స్థానిక ఐటీ ఐ ఏటీసీలోని విద్యార్థులకు శనివారం చట్టాల పై జడ్జి అవగాహన కల్పించారు. సైబర్‌ నేరా లు, మహిళలపై అఘాయిత్యాలు, ఆన్‌లైన్‌ మో సాలు, మత్తుపదార్థాలతో ఎదురయ్యే సమస్యలపై ఆయన వివరించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మంచి చదువులతో ఉన్నతంగా ఎదగాలని సూచించా రు. ఎస్సై సంధ్యారాణి, ప్రిన్సిపాల్‌ సురేందర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ విద్యాసాగర్‌రెడ్డి, న్యాయవాది గుడికందుల భూమయ్య పాల్గొన్నారు.

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాట్ల పరిశీలన

పెద్దపల్లిరూరల్‌: పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి తరలించేందుకు వీలుగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌, అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. టీపీవో వినయ్‌, ఏఈ సతీశ్‌ పాల్గొన్నారు.

ముగిసిన శిక్షణ

పెద్దపల్లిరూరల్‌: జాతీయ ప్రకృతి వ్యవసాయమిషన్‌లో భాగంగా సుస్థిర వ్యవసాయ సంస్థ(ఎన్‌జీవో) ఆధ్వర్యంలో ఐదురోజులుగా కృషి సఖిలకు సాగిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి రైతువేదికలో నిర్వహించిన ఈ శిక్షణ తరగ తులకు జిల్లాలోని 15 క్లస్టర్‌ల నుంచి సుమారు 125 మంది రైతులు హాజరయ్యారు. వీరికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం సర్టిఫికెట్లను జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ ప్రదానం చేశారు. కార్యక్రమంలో పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

గోదావరిఖని: నగరంలోని సమస్యాత్మక పో లింగ్‌ కేంద్రాలను పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేశ్‌ శనివారం తనిఖీ చేశారు. అశోక్‌నగర్‌, రమేశ్‌నగర్‌, చంద్రశేఖర్‌, 7ఎల్‌ఈపీ ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలు, పరిసరాల్లో ఏ ర్పాట్లు, బందోబస్తు, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.

ప్రణాళికతో చదవాలి

పెద్దపల్లి: పోటీపరీక్షల కోసం నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధిస్తా రని జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్‌ అ న్నారు. టాస్క్‌ రీజినల్‌ సెంటర్‌లో బ్యాంకింగ్‌ ఉద్యోగాల కల్పనపై శనివారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిగ్రీ చదువుతున్న దశలోనే పోటీపరీక్షలకు సన్నద్ధం కావాలన్నా రు. ఉపాధి అవకాశాలు, కెరీర్‌ ప్రణాళిక, పోటీపరీక్షల అవగాహన తదితర అంశాలపై వివ రించారు. టాస్క్‌ జిల్లా మేనేజర్‌ గంగాప్రసాద్‌, రీజినల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి కౌసల్య, ప్రిన్సిపాల్స్‌ ఉగేందర్‌, రాకేశ్‌, సమద్‌ పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన అవసరం 1
1/4

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం 2
2/4

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం 3
3/4

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం 4
4/4

చట్టాలపై అవగాహన అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement