కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే మోసం ఉంది | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే మోసం ఉంది

Feb 8 2026 4:22 AM | Updated on Feb 8 2026 4:22 AM

కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే మోసం ఉంది

కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే మోసం ఉంది

గోదావరిఖని: కాంగ్రెస్‌ పార్టీ డీఎన్‌ఏలోనే మోసం ఉందని, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు మాయ మాటలతో మోసం చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆరోపించారు. నగరంలోని 48, 9, 39, 11, 43, 42, 13, 55, 57వ డివిజన్లలో శనివారం జరిగిన కార్నర్‌ మీటింగ్‌ల్లో వారు మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్‌ నాయకులను నిలదీయాలని ప్రజలను కోరారు. రామగుండంలో రాక్షసపాలన నడుస్తోందని, ఇళ్లను కూల్చి వ్యాపారులను రోడ్డుపై పడేశారని ధ్వజమెత్తారు. రెండేళ్లుగా వి ధ్వంసం కొనసాగుతోందన్నారు. ప్రశ్నిస్తే కేసులు, ఎదిరిస్తే బెదిరింపులు జరుగుతున్నాయన్నారు. ని యంతపాలన పోవాలంటే బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమ ని అన్నారు. నాయకులు గోపు అయులయ్య యా దవ్‌, పెంట రాజేశ్‌, నడిపెల్లి మురళీధర్‌రావు, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి పాల్గొన్నారు.

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement