మంథనిలో తూర్పు నేతలు!
మంథని: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మంథనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్థులు విజయం సాధించేందుకు శతవిధాలా ప్రయత్నా లు చేస్తున్నాయి. నియోజకవర్గంలోని తమపార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులను రప్పించుకుని మరీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.
పొరుగు జిల్లా నుంచి..
నియోజకవర్గంలో భాగమైన జయశంకర్ భూపా లపల్లి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మంథనిలో మకాం వేశారు. ఇంటింటా పర్యటిస్తూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఇతర మండలా లకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు వా ర్డుల వారీగా ఇన్‌చార్జిలను నియమించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంథనిలో ఇతర నా యకుల ప్రచారంపై ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన నాయకులే ఓటర్లను అభ్యర్థించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీన్నిబట్టి గెలుపు రెండు పార్టీలకు ఎంతప్రతిష్టాత్మకమనేది అర్థమవుతోంది. రెండు పార్టీల నాయకులు ఇంటింటా పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థించడం శాసనసభ ఎన్నికలను తలపిస్తోంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీల నేతలు
అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మున్సి‘పోల్స్’


