పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులా? | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులా?

Feb 4 2026 7:03 AM | Updated on Feb 4 2026 7:03 AM

పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులా?

పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులా?

గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు కాంగ్రెస్‌ పార్టీ సేవకులుగా మారిపోయారని ఆయన మండిపడ్డారు. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలన నియంతలా, దుర్మార్గంగా సా గుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచే దమ్ము, ధైర్యం లేనిఎమ్మెల్యే.. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భయపెట్టి సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈఎన్నికల్లో తామంటే ఏమిటో చూపిస్తామని కోరుకంటి చందర్‌ సవాల్‌ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కడతారని అన్నారు. నాయకులు నడిపెల్లి అభిషేక్‌రావు, గోపు అయిలయ్యయాదవ్‌, నడిపెల్లి మురళీధర్‌రావు, నారాయణదాసు మారుతి, చల్లా రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement