క్రీడల్లో రాణించాలి
పెద్దపల్లి: క్రీడలకు పుట్టినిల్లు సుల్తానాబాద్ అ ని డీవైఎస్‌వో సురేశ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేపట్టిన సీ ఎం కప్ క్రీడా పోటీలు బుధవారం ముగిశా యి. సురేశ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం వి విధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి బ హుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఎంఈవో రాజ య్య, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్, ఎస్జీఎఫ్ మండల కార్యదర్శి ప్రణయ్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్, సంధ్య, శ్రీవాణి, వెంకటేశ్, ఆసియా బేగం, సత్యం, సతీశ్, సంపత్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభకు పురస్కారం
పెద్దపల్లి: విధి నిర్వహణలో ప్రతిభ చూపిన జి ల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ సా యిభవాని, ల్యాబ్ టెక్నీషియన్ అజయ్‌కు స్టా ర్ పెర్ఫార్మెన్స్ అవార్డు అందించినట్లు సూపరింటెండెంట్ శ్రీధర్ బుధవారం తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు అన్ని కేటగిరీల సిబ్బందికి పనితీరు ఆధారంగా ప్రతినెలా పురస్కా రం అందిస్తున్నామన్నారు. కాగా, గాల్‌బ్లాడర్ లో స్టోన్‌తో బాధపడుతున్న గోదావరిఖనికి చెందిన ఇద్దరు మహిళలకు డాక్టర్లు అమరసింహారెడ్డి, సాయిప్రసాద్, రామం, భవాని బృందం ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేశారని శ్రీధర్ వివరించారు. వైద్యులను ఆయన అభినందించారు. ఆస్పత్రి లో అందిస్తున్న 2డీ ఇకో, లాప్రోస్కోపిక్, యూరాలజీ, రూట్‌కెనాల్ తదితర సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆర్‌ఎంవో విజయ్‌కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున పాల్గొన్నారు.
ఆర్‌ఐఈ శిక్షణకు ఎంపిక
సుల్తానాబాద్‌రూరల్: చిన్నబొంకూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ కిషన్ బెంగళూరులోని రీజినల్ ఇ నిస్టిట్యూట్ ఆఫ్ ఇంగి ఫ్లాష్ (ఆర్‌ఐఈ)లో 30 రోజుల పాటు చేపట్టే కోర్స్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్(సీఈఎల్డీ)శిక్షణకు ఎంపికయ్యారు. మనరాష్ట్రం నుంచి 50 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాగా మనజిల్లా నుంచి అందులో కిషన్ ఉన్నా రు. ఆయనను పలువురు అభినందించారు.
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్
పెద్దపల్లి: పురపాలక సంఘ పరిధిలోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమేశ్ బుధవా రం కోరారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారి చిరునామాలు సేకరించామని, పోస్టల్ బ్యాలెట్ ముద్రణ పూర్తయిన వెంటనే వారికి బ్యాలెట్ పేపర్లు పంపిస్తామని అన్నారు. ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.
ప్రశ్నించే గొంతుక అవసరం
మంథని: హామీలను అమలు చేయడంతో విఫలమై కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల పేరిట మ రోమారు ప్రజలకు ముందుకు వస్తోందని, ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వ ర్ అన్నారు. స్థానిక గాంధీచౌక్‌లో బీఆర్‌ఎస్ అ భ్యర్థుల పరిచయ వేదిక పేరిట బుధవారం ని ర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభు త్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు ఆ పా ర్టీకి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నా రు. బీఆర్‌ఎస్ అభ్యర్ఖులను ఆదిరించాలని కో రారు. మాజీఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడా రు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎన్నికల సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.
క్రీడల్లో రాణించాలి
క్రీడల్లో రాణించాలి
క్రీడల్లో రాణించాలి


