ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు?
అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎలా స్పందిస్తారు?
ప్రత్యేక చర్యలేమైనా తీసుకుంటున్నారా?
ఎంతమంది సిబ్బంది సేవలు వినియోగిస్తున్నారు?
ఓటర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఏమైనా ఆంక్షలు అమలు చేస్తారా?
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్న విద్యార్థిని
సీపీ: భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాం. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాం. క్విక్ రెస్పాన్స్ టీంలను నియమించాం. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాం.
సీపీ: సమీప పోలీసు బలగాలు వెంటనే రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాం. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
సీపీ: ఎన్నికలకు ఒకరోజు ముందు, పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు, గొడవలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశాం.
సీపీ: ెపద్దపల్లి జోన్‌లో 5, మంచిర్యాల జోన్‌లో 4 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టాం. ఇద్దరు డీసీపీలు, ఏడుగురు ఏసీపీ లు, 28మంది సీఐలు, 86మంది ఎస్సైలు, 596 ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 195 మంది హోంగార్డులు, 95 క్యూఆర్టీ టీంలు, రూట్‌మోబైల్ పార్టీలు 69,298 మంది సిబ్బందిని వినియోగిస్తున్నాం.
సీపీ: ఓటర్లు ప్రశాంతంగా వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలి. ప్రలోభాలు, వదంతులకు లోనుకావొద్దు.
సీపీ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం,పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు అమలులో ఉంటుందని రా మగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఈనెల 9న సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు, ఈనెల 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన వివరించారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గోదావరిఖని: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 11న పోలింగ్ నిర్వహణకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉండగా, 124 డివిజన్లు/వార్డుల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 126 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సాగేందుకు పటిష్ట బందోబస్తు చేపట్టామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు


