ట్రాన్స్‌ జెండర్ల ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ జెండర్ల ఆదర్శం

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

ట్రాన

ట్రాన్స్‌ జెండర్ల ఆదర్శం

కోల్‌సిటీ(రామగుండం)/పెద్దపల్లిరూరల్‌: రామగుండం నగరంలోని ట్రాన్స్‌జెండర్లు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు అవగాహన కోసం నియమించిన ట్రాన్స్‌జెండర్‌ ఐకాన్‌ ఓరుగంటి లైలా ఆదేశాల మేరకు జిల్లా మోడ్రన్‌ అవీర్నెస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించారు. వారు మాట్లాడుతూ, ప్రలోభాలకు గురికాకుండా సరైన నాయకు న్ని ఎన్నుకునేందుకు ఓటుహక్కు వినియోగించుకున్నామన్నారు. పురుషులు, మహిళలకు తీసిపోని వి ధంగా ట్రాన్స్‌జెండర్స్‌ను ఎన్నికల సంఘం గుర్తించి, ప్రత్యేక విభాగం కింద ఓటుహక్కు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటుహక్కును వినియోగించుకున్న వారిలో జిల్లా మోడ్రన్‌ అవేర్నెస్‌ సొసైటీ సభ్యులు సమక్క, భవాని, శివాని, లాస్య, సుష్మా, అనిత, శ్రావ్య, నాంపల్లి కావ్య, శ్రీవర్ష, అ న్విత, అపరంజి, గాయత్రి ఉన్నారు. మరోవైపు.. జిల్లాకేంద్రంలో హిజ్రాలు జ్వాలాముఖి, రిషిత ఓటుహక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు.

ఓటుహక్కు వినియోగించుకున్న వైనం

ట్రాన్స్‌ జెండర్ల ఆదర్శం 1
1/2

ట్రాన్స్‌ జెండర్ల ఆదర్శం

ట్రాన్స్‌ జెండర్ల ఆదర్శం 2
2/2

ట్రాన్స్‌ జెండర్ల ఆదర్శం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement