మేయర్‌పై ఉత్కంఠ! | - | Sakshi
Sakshi News home page

మేయర్‌పై ఉత్కంఠ!

Feb 16 2026 7:15 AM | Updated on Feb 16 2026 7:15 AM

మేయర్‌పై ఉత్కంఠ!

మేయర్‌పై ఉత్కంఠ!

నేడు ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్సన్‌కు కూడా నేడే..

పెద్దపల్లిలో మల్లయ్య, సుల్తానాబాద్‌లో కృష్ణను వరించనున్న పీఠం

రామగుండంలో సినీయర్‌ నేత వైపే అధిష్టానం మొగ్గు

మంథనిలో బీసీ సామాజికవర్గం నేతపై మంత్రి చూపు

సాక్షి పెద్దపల్లి/పెద్దపల్లి:

జిల్లాలోని రామగుండం మేయర్‌, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్ల ఎన్ని కకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బల్దియా ఎన్నికల్లో చివరిఘట్టం వీరి ఎన్నికే. ఈమే రకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. బల్దియా ఫలితా లు వెలుబడిన వెంటనే శిబిరాలకు తరలివెళ్లిన కా ర్పొరేటర్లు, కౌన్సిలర్లు.. సోమవారం బల్దియాలకు చేరుకోనున్నారు. రామగుండం కార్పొరేషన్‌ సహా మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ సీట్లు సాధించినా.. పీఠాలు అధోరోహించేది ఎవరనేదానిపై ఉత్కంఠ తొలగలేదు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదువల కోసం పోటీపడుతున్న వారు ఎవరికివారే పావులు కదుపుతున్నారు.

సీనియర్‌ నేతకే ‘రామగుండం’

రామగుండం మేయర్‌ పీఠం ఎస్సీ జనరల్‌కు కేటా యించారు. 60 డివిజన్లలో కాంగ్రెస్‌ 38 దక్కించుకు ని మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఎస్సీ కార్పొరేటర్లు మేయర్‌ పీఠం కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేశా రు. వీరంతా హైదరాబాద్‌లోని క్యాంపులోనే ఉన్నా రు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌, మంత్రి శ్రీధర్‌బాబు వారితో విడివిడిగా చర్చించి మేయర్‌ అభ్యర్థిపై అభిప్రాయాలు సేకరించి, మేయర్‌ అభ్యర్థి పేరును సీల్డ్‌ కవరలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పీసీసీ నేతలకు అందించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మహంకాళి స్వామికి మేయర్‌ పీఠం దక్కే అవకాశా లు ఉన్నాయి. స్వామితోపాటు నెలకంటి రాము, ఏ కగ్రీవంగా ఎన్నికై న విజయ, తాళ్లపల్లి యుగంధర్‌ కూడా మేయర్‌ కోసం పోటీపడుతున్నారు. డిప్యూ టీ మేయర్‌ బీసీ లేదా మైనార్టీలను వరించనుంది. మహ్మద్‌ ముస్తఫా, షాపెదలతోపాటు పాతిపెల్లి ఎ ల్లయ్య, మారెల్లి సుశీల, ఇసంపల్లి అంజయ్య, గట్టు రమేశ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

విధేయతేకే ‘పెద్దపల్లి’

పెద్దపల్లిలోని 36 వార్డుల్లో 27 గెలిచిన కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌(బీసీ–జనరల్‌) పీఠం కైవసం చేసుకుంది. సీనియర్‌ నేత, మాజీ వైస్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య పేరును ఎమ్మెల్యే విజయరమణారావు ఇప్పటికే ప్ర కటించారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే. ముగ్గురు ముస్లింలు విజయం సాధించగా.. అందు లో ఒకరికి వైస్‌చైర్మన్‌గా ఏకాభిప్రాయంతో అవ కాశం దక్కనుంది.

మాటకు కట్టుబడి.. ‘సుల్తానాబాద్‌’

సుల్తానాబాద్‌ చైర్మన్‌(జనరల్‌)లో 15 వార్డులు ఉండగా.. 12 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు గెలిచి మ్యాజి క్‌ ఫిగర్‌ దాటేసింది. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడు బిరుదు రాధాకృష్ణను మున్సిపల్‌ చైర్మన్‌ను చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు గత ఎన్నికల సమస్యంలోనే మాటిచ్చారు. ఆ మాట ను నిలబెట్టుకునేందుకు ఎమ్మెల్యే కట్టుబడి ఉన్నా రు. దీంతో బిరుదు కృష్ణకు చైర్మన్‌ పదవి దక్కనుంది. వైస్‌ చైర్మన్‌ కోసం గాజుల రాజమల్లు, ఉట్ల వరప్రసాద్‌, బాకం సాయికిశోర్‌ యత్నిస్తున్నారు.

మంత్రి ఆశీస్సులు ఎవరికో...

మంథని(బీసీ జనరల్‌)లోని 13 వార్డుల్లో 11 వా ర్డులను కాంగ్రెస్‌ దక్కించుకుని మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఇందులో పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన మాజీ సర్పంచ్‌ వొడ్నాల శ్రీనివాస్‌కే మంత్రి ఆశీస్సులు ఉన్నాయి. వైస్‌ చైర్మన్‌గా ముసుకుల సహేందర్‌రెడ్డికి అవకాశం ఉంది.

మేయర్‌, చైర్మన్‌ ఎన్నికలు ఇలా..

రామగుండం మేయర్‌, మూడు మున్సిపల్‌ చైర్‌పర్సన్ల ఎన్నికల కోసం హాజరైన వారిలో మెజార్టీ స భ్యులు చెయ్యెత్తితే చాలు ఎన్నికై నట్లే. కోరానికి సరిపడా సభ్యులు ఉంటే సమావేశం ప్రారంభిస్తారు. అ న్ని బల్దియాల్లో కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో ఎక్కడా కోరం లేనిపరిస్థితులు ఉండ వు. ఎక్స్‌ అఫీషియో సభ్యుల సహకారం లేకుండానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు పెద్దపల్లిలో 36 వార్డులు ఉండగా, అందులో సగం కన్నా ఒకటి ఎక్కువ.. అంటే 19మంది సభ్యులు మద్దతు ఇస్తే వారు చైర్మన్‌గా ఎన్నికై నట్లే. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక విధానంలోనూ ఇదే పద్ధతి అనుసరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement