కాంగ్రెస్‌లో చేరిక
జ్యోతినగర్: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ అన్నారు. ఎన్టీపీసీ రామగుండంలో 24వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కొలని కవితారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్ల విజయ్‌రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు చేతి గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కొత్త విద్యుత్ కేంద్రం స్థాపనతో ఉపాధి కల్పన
రామగుండం: త్వరలోనే రామగుండంలో కొత్త విద్యుత్ కేంద్రం స్థాపనతో ఉపాధి కల్పన మెరుగుపడుతుందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు సలీంబేగ్ ఆధ్వర్యంలో 27వ డివిజన్ విద్యుత్‌నగర్‌కు చెందిన బీఆర్‌ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు సిరంశెట్టి శ్రీనివాస్, ప్రతినిధులు తాటి కొమురయ్య, సంతోష్‌కుమార్, మహిపాల్‌రెడ్డి, రాజిరెడ్డి, వెంకన్న, సతీశ్‌కు ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


