పోలింగ్‌ కేంద్రంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిపై దాడి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిపై దాడి

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

పోలింగ్‌ కేంద్రంలో   ఇండిపెండెంట్‌ అభ్యర్థిపై దాడి

పోలింగ్‌ కేంద్రంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిపై దాడి

● ఆదర్శంగా మారిన యువ ఇంజినీర్‌ జయాకర్‌ రాజు

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ 57వ డివిజన్‌లో ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్థిపై అధికార పార్టీ అనుచరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారి ఓట్లకు సంబంధించిన పేర్ల విషయంలో వివాదం ఏర్పడినట్లు చెబుతున్నారు. ఈక్రమంలో అక్కడే ఉన్న అధికార పార్టీ అభ్యర్థి అనుచరులు దాడిచేసినట్లు పేర్కొంటున్నారు. అలాగే స్థానిక 12వ డివిజన్‌లో మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి ఓటు వేసేందుకు రాగా అక్కడ ఉన్న పోలింగ్‌ ఏజెంట్‌ అడ్డుకోవడంతో వివాదం ఏర్పడింది. వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డికి సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఓటరు కార్డు, ఆధార్‌కార్డు, ఓటరు లిస్టు పరిశీలించి రిటర్నింగ్‌ అధికారి అనుమతి మేరకు ఓటువేసేందుకు అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది.

పోలింగ్‌ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్‌ ఆందోళన

మెట్‌పల్లి: పట్టణంలోని 12వార్డు పోలింగ్‌ కేంద్రం వద్ద బుధవారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హారిక, స్వతంత్ర అభ్యర్థి సుమయ్య ముఖీమ్‌ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీ టీచర్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని సమాచారం రావడంతో ఇరువర్గాలు కేంద్రం వద్దకు చేరుకుని బైఠాయించారు. ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారులు జోక్యం చేసుకొని ఆమెను విధుల నుంచి తప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే 6, 22వార్డుల్లో కూడా ఇరు వర్గాల మధ్య స్వల్ప గొడవ చోటు చేసుకుంది.

ఒకరి ఓటు..మరొకరు వేసిన వైనం

12వార్డుకు చెందిన షేక్‌ ఆసిఫ్‌ ఓటు వేయడానికి కేంద్రానికి రాగా.. అప్పటికే అతని ఓటు మరొకరు వేయడంతో కంగుతిన్నాడు. విషయం తెలుసుకున్న కొందరు అభ్యర్థులు దొంగ ఓట్లు పడుతున్నాయని గ్రహించి ఆసిఫ్‌ ఓటును మరొకరు ఎలా వేస్తారని అధికారులను నిలదీశారు. దీనికి వారు వచ్చిన వ్యక్తి ఓటరు కార్డు చూపడంతో అన్ని వివరాలు సరి చూసుకొని అనుమతించామని బదులిచ్చారు.

ఓటు వేసేందుకు కర్నాటక నుంచి రాక

కోల్‌సిటీ(రామగుండం): కర్నాటక రాష్ట్రంలో పనిచేస్తున్న ఓ యువ ఇంజినీ ర్‌ పెద్దపల్లి జి ల్లా రామగుండం కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించడానికి రెండురోజులు సెలవుపెట్టి తన ఇంటికి వచ్చాడు. గోదావరిఖని రమేశ్‌నగర్‌కు చెందిన జయాకర్‌రాజు కర్నాటక రాష్ట్రంలోని స్టాల్‌ప్లాంట్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ దినపత్రికలు చదవడం అలవాటు ఉన్న జయాకర్‌రాజుకు రామగుండం కార్పొరేషన్‌ ఎన్నికలు ఉన్నాయని తెసింది. గోదావరిఖనిలోని తన మిత్రుల ద్వారా ఎన్నికల వివరాలు సేకరించాడు. ఓటుహక్కును ఎన్నికల్లో వినియోగించుకోవడానికి గోదావరిఖనికి వచ్చాడు. బుధవారం జవహార్‌నగర్‌లోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటువేశాడు. తనవంతు బాధ్యత నిర్వర్తించాని తెలిపాడు. ఎక్కడ పనిచేస్తున్నామన్నది ముఖ్యం కాదని, మన ప్రాంత అభివృద్ధికి మన ఓటు ఎంతో కీలకమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement