హామీలు అమలు చేస్తున్నాం
మంథని: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గురువారం మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్‌పేట, ముత్యాలమ్మ వీధి, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు. మంథని మున్సిపాలిటీ అభివృద్దికి రూ.40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు పలకాలని కో రారు. కార్యక్రమంలో వొడ్నాల శ్రీనివాస్, ముస్కుల సహేందర్‌రెడ్డి, పోలు శివ, సీపతి బానయ్య, నూకల కమల్ తదితరులు పాల్గొన్నారు.


