కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
గోదావరిఖని(రామగుండం): కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. గురువారం రాత్రి స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా 9, 10, 37, 38, 39, 47,48,49, 50 డివిజన్ల ప్రజలతో మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి ఈప్రాంతానికి మరిన్ని నిధులు తీసుకవచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు పాల్గొన్నారు.


