వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు
పెద్దపల్లి: వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సో షల్ జస్టిస్ డేలో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ఆ యన పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకు న్న 61మంది సర్వేయర్లకు లైసెన్స్‌లు అందజేసి మా ట్లాడారు. ప్రభుత్వం శాసీ్త్రయ పద్ధతిలో కుల సర్వే చేసిందన్నారు. భూ రికార్డులపై భరోసా కల్పించేలా లైసెన్స్‌డ్ సర్వేయర్‌లు పనిచేయాలని సూచించా రు. అధికారులు రవీందర్, వేణుగోపాల్, రంగారెడ్డి, ప్రకాశ్, సోమేశ్వర్, గంగయ్య పాల్గొన్నారు.
చైన్‌మెన్ సస్పెన్షన్
మంథని ఆర్డీవో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న చైన్‌మన్ ఇ.రఘును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. విధుల్లో ని ర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికే అనేకసార్లు మెమోలు జారీ చేసినా మార్పు లేదని, గత జనవరి 13న సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యా రని మంథని ఆర్డీవో నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పంచాయతీ కార్యదర్శి..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు రూ.4,26,850 నుంచి రూ.2,82,247 ప్రభుత్వ ఖజానాకు జమ చేయకపోవడంతో కాల్వశ్రీరాంపూర్ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు.
రాఘవాపూర్‌లో..
పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రవిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీలో వసూలు చేసిన పన్నులు, బిల్లుల సొమ్మును సొంతానికి వాడుకున్న ట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్న ట్టు సమాచారం.
ధర్మారంలో..
ధర్మారం(ధర్మపురి): ధర్మారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రవిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన ఆస్తిపన్ను రూ.63,332 ట్రెజరీలో జమచేయకుండా సొంతానికి వాడుకోవడం, ఆస్తిపన్ను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వ హించడంతో ఎంపీడీవో నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో ఆయన వివరించారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


