సందేశాత్మక పోలింగ్‌ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

సందేశాత్మక పోలింగ్‌ కేంద్రాలు

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

సందేశ

సందేశాత్మక పోలింగ్‌ కేంద్రాలు

కరీంనగర్‌ 63వ డివిజన్‌ భాగ్యనగర్‌ సెయింట్‌ అల్ఫోన్స్‌ స్కూల్‌లో..

కరీంనగర్‌ 62వ డివిజన్‌ మంకమ్మతోట బాలికల పాఠశాలలో

సిరిసిల్ల కుసుమ రామయ్య స్కూల్‌లో మోడల్‌ పోలింగ్‌ కేంద్రం

సిరిసిల్ల గాంధీనగర్‌లో గ్రీన్‌ పోలింగ్‌ స్టేషన్‌ ముఖద్వారం

కరీంనగర్‌, సిరిసిల్ల మున్సిపల్‌ అధికారులు ఏర్పాటు చేసిన మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఆకట్టుకున్నాయి. సిరిసిల్ల గాంధీనగర్‌లోని పోలింగ్‌ స్టేషన్‌ను గ్రీన్‌పోలింగ్‌ స్టేషన్‌గా పచ్చని మొక్కలు, పచ్చని కార్పెట్స్‌, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్‌లో బెలూన్‌లతో అలంకరించి, పెఽళ్లి మండపాన్ని తలపించే రీతిలో రెడ్‌ కార్పెట్‌ పరిచారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. సిరిసిల్ల మోడల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింటు ఆకట్టుకుంది. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, ఆర్డీవో వెంకటేశ్వర్లు వృద్ధ మహిళా ఓటరుతో ఫొటోలు దిగారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఐదు రకాల థీమ్స్‌లతో ఐదు ఆదర్శ పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 7వ డివిజన్‌ కుమార్‌వాడీ ప్రభుత్వం పాఠశాల పోలింగ్‌స్టేషన్‌ వద్ద తడి, పొడి చెత్త సెక్రిగేషన్‌ థీమ్‌తో, 19వ డివిజన్‌ రేకుర్తి లయోలా హైస్కూల్‌ పోలింగ్‌ స్టేషన్‌ వద్ద జనరల్‌ ఓటర్లను అవగాహన పరిచేలా, 44వ డివిజన్‌ సప్తగిరికాలనీ ప్రభుత్వ పాఠశాల వద్ద టూరిజం థీమ్‌గా, 63వ డివిజన్‌ భాగ్యనగర్‌ సేయింట్‌ అల్ఫోన్స్‌ స్కూల్‌ వద్ద శానిటేషన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ థీమ్‌గా, 62వ డివిజన్‌ మంకమ్మతోట ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ వద్ద జీరో ప్లాస్టిక్‌ ఓన్‌గ్రీన్‌థీమ్‌ ఏర్పాటు చేశారు.

– సిరిసిల్ల/కరీంనగర్‌కల్చరల్‌

సందేశాత్మక పోలింగ్‌ కేంద్రాలు1
1/4

సందేశాత్మక పోలింగ్‌ కేంద్రాలు

సందేశాత్మక పోలింగ్‌ కేంద్రాలు2
2/4

సందేశాత్మక పోలింగ్‌ కేంద్రాలు

సందేశాత్మక పోలింగ్‌ కేంద్రాలు3
3/4

సందేశాత్మక పోలింగ్‌ కేంద్రాలు

సందేశాత్మక పోలింగ్‌ కేంద్రాలు4
4/4

సందేశాత్మక పోలింగ్‌ కేంద్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement