జీవితాంతం మధుర జ్ఞాపకం
కోల్‌సిటీ/ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం)/పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కు లభించిన యువత ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న యువఓటర్లు.. ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక మర్చిపోలేని అనుభూతి అని యువకులు, యువతులు స్పందించారు. ఓటరు జాబితాలో పేరును చూసి, బ్యాలెట్ పేపర్‌పై నచ్చిన గుర్తుపై స్వస్తిక్ ముద్రవేసిన క్షణం జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. నగర, పట్టణ అభివృద్ధి, పారదర్శక పాలన కోసం తమ ఓటు కీలకమని యువత అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య పండుగలో తొలిసారి భాగస్వాములైన యువ ఓటర్ల సందడి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హెదరాబాదులో చదువుతున్న. తొలిఓటు వేయడానికి గోదావరిఖనికి వచ్చా. ఓటు వేసిన తర్వాత వాట్సాప్ స్టేటస్‌లో పెడితే, నా ఫ్రెండ్స్ కూడా ఓటు వేసి స్టేటస్‌లో పెట్టుకున్నారు. హ్యాపీగా ఉంది.
– మామిడి సాయిచరణ్, బీటెక్, గోదావరిఖని
మున్సిపల్ ఎన్నికల్లో తొలిఓటు వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉంది. నాన్నతో కలిసి ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా. ఓటు ఎలావేయాలి, ఎవరికి వేయాలనే ఓటు ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాను.
– సాయిలిఖిత, బీఫార్మసీ, గోదావరిఖని
నా పేరున ఇంటికి ఫొటో గుర్తింపు పోల్ చిట్టీరావడం చాలాసంతోషం అనిపించింది. తొలిఓటు వేయడం మర్చిపోలేని అనుభూతి. ఎన్నికల ప్రక్రియ తెలుసుకోవడానికి ఏజెంట్‌గా కూడా సేవలందించా.
– సాయిసుహాస్, బీటెక్, గోదావరిఖని
జీవితాంతం మధుర జ్ఞాపకం
జీవితాంతం మధుర జ్ఞాపకం
జీవితాంతం మధుర జ్ఞాపకం


