పోలింగ్‌ ప్రశాంతం: పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ ప్రశాంతం: పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

Feb 12 2026 7:15 AM | Updated on Feb 12 2026 7:15 AM

పోలింగ్‌ ప్రశాంతం: పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

పోలింగ్‌ ప్రశాంతం: పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్‌ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా నేతృత్వంలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి ఆధ్వర్యంలో భారీపోలీసు బందోబస్తు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంథని, రామగిరి, గోదావరిఖని టూటౌన్‌, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పోలింగ్‌ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లు, పోలింగ్‌ సిబ్బంది విధులు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై డీసీపీ అధికారులతో సమీక్షించారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత భారీ బందోబస్తు మధ్య బ్యాలెట్‌ బాక్స్‌లను స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, సీఐ ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement