స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్
పెద్దపల్లి: మంథని జెడ్పీ హైస్కూల్(బాలికలు)లోని స్కూల్ అసిస్టెంట్ కొమురాజు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి శారద బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నరాదని, సోషల్ మీడియాతోపాటు ప్రెస్ క్లిప్పింగ్ ఆధారంగా ఎంఈవో విచారణ జరిపి నివేదిక అందజేశారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్లు వివరించారు.
మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని అరవింద్‌నగర్‌లో బుధవారం మహిళ మెడలోంచి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు రెండు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన గట్ల శైలజ నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడేసరికే దొంగలు పారిపోయారు. పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.


