వేగంగా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

వేగంగా అభివృద్ధి

Feb 9 2026 8:13 AM | Updated on Feb 9 2026 8:13 AM

వేగంగ

వేగంగా అభివృద్ధి

మంథని మున్సిపల్‌లో అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. కొన్ని పను లు మిగిలి ఉన్నాయి. మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో అవికూడా పూర్తవుతాయి. ఇందుకో సం సమర్థవంతమైన నాయకత్వం, ప్రజా సమస్యలపై అవగాహన అవసరం.

– మూల పురుషోత్తంరెడ్డి, రైతు, 11వ వార్డు

రోడ్లు నిర్మించాలి

మా కాలనీలో ఇరవై ఏళ్లుగా కొత్త ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా పట్టణంలో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టాలి. కొన్నిచోట్ల మట్టిరోడ్లు అసౌకర్యంగా ఉన్నాయి. మా కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

– తాత రాయమల్లు,

రిటైర్డ్‌ ఉద్యోగి, గోదావరిరోడ్డు

డ్రైనేజీలు అవసరం

మా కాలనీలో మురుగునీటి కాలువలు సరిగ్గా లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మురుగునీటి కాలువలు కూడా నిర్మించి మిగిలిన సమస్యలు పరిష్కరించండి. కోతులు, కుక్కలతో ఇబ్బందులు లేకుండా చూడాలి.

– కట్టకోళ్ల కిష్టయ్య, శ్రీరామకాలనీ

ఇల్లు మంజూరు చేయండి

ప్రస్తుతం మేం ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరింది. కొత్త ఇల్లు మంజూరు చేస్తే నిర్మించుకుంటా. మా కాలనీలో మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయండి. వార్డుల్లో ఉన్న సమస్యలు గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలి.

– గందం నగేశ్‌, ఫొటోగ్రాఫర్‌, శ్రీపాదకాలనీ

కోతుల బెడద తీర్చండి

మా వార్డులో కోతులు బీభత్సం చేస్తున్నాయి. ఇండ్లలోకి చొరబడి సామగ్రి ఎత్తుకెళ్తున్నాయి. ప్రజలపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. కోతుల సమస్య తీవ్రంగా ఉంది. కొత్తపాలక వర్గం కోతుల సమస్య పరిష్కారినికి ప్రయత్నాలు చేయాలి.

– చింతపట్ల అరుణ్‌కుమార్‌, ఒకటోవార్డు

గదులు కట్టించాలి

మంథని సమీప గోదావరి నదిలో స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలి. ప్రధానంగా మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా గదులు నిర్మించాలి. వాకింగ్‌ కోసం వెళ్లే సమయంలో సమస్య తీవ్రత కనబడుతుంది.

– అయిలి సత్యనారాయణ, వ్యాపారి

శ్మశానవాటిక మార్చాలి

గోదావరి తీరంలో శ్మశాన వాటికను మార్చాలి. నదిలో స్నానాలు చేసే ప్రాంతం సమీపంలోనే ఉండడంతో అసౌకర్యం కలుగుతోంది. నది ఒడ్డున కొత్తగా ఏర్పాటు చేసిన గ్యాస్‌ బర్నింగ్‌ పై ప్రజల్లో పర్యావరణ సమస్యపై వివరించాలి.

– బొట్ల ఆంజనేయులు, న్యాయవాది

గోదావరి రోడ్డు విస్తరించాలి

బస్సు డిపో – గోదావరి నది మధ్య రోడ్డు విస్తరించాలి. సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలి. సురాభాండేశ్వర దేవాలయం నుంచి గౌతమేశ్వర దేవాలయం వరకు గోదావరి నదిపై పర్మినెంట్‌ రోడ్డు నిర్మించి భక్తులకు సౌకర్యం కల్పించాలి.

– గట్టు రాము, రామాలయ పూజారి

వేగంగా అభివృద్ధి 
1
1/7

వేగంగా అభివృద్ధి

వేగంగా అభివృద్ధి 
2
2/7

వేగంగా అభివృద్ధి

వేగంగా అభివృద్ధి 
3
3/7

వేగంగా అభివృద్ధి

వేగంగా అభివృద్ధి 
4
4/7

వేగంగా అభివృద్ధి

వేగంగా అభివృద్ధి 
5
5/7

వేగంగా అభివృద్ధి

వేగంగా అభివృద్ధి 
6
6/7

వేగంగా అభివృద్ధి

వేగంగా అభివృద్ధి 
7
7/7

వేగంగా అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement