కాంగ్రెస్ ఖాతాలోనే పెద్దపల్లి
పెద్దపల్లి: పెద్దపల్లిపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మున్సిపల్ 2, 8, తొమ్మితో వా ర్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పస్తం లక్ష్మి, ఎరుకల కల్పన, ఎండీ నాదీమ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే శనివారం ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పెద్దపల్లి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.కో ట్లు తీసుకొచ్చామని తెలిపారు. ఆర్టీసీ బస్ డిపో, బైపాస్ రోడ్డు మంజూరు చేయించామని అ న్నా రు. ప్రధాన హదారులను అభివృద్ధి చేయడంతో పాటు వీధుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభి వృద్ధి, సంక్షేమాన్నిచూసి చేతిగుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
బీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కులేదు
సుల్తానాబాద్ రూరల్: బీఆర్‌ఎస్‌కు సుల్తానాబాద్ పట్టణంలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సుల్తానాబాద్ పట్టణంలో ఆయన శనివారం ఇంటింటా ప్రచారం చేశారు. అనంతరం కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న గతప్రభుత్వం సుల్తానాబాద్ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించిందని, వాటిని మళ్లీ వెనక్కి తీసుకొచ్చిన ఘనత తనకే దక్కిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్‌రావు, నాయకుడు దుగ్యాల సందీప్‌రావు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయరమణారావు, ఓటు వేయాలని అభ్యర్థిస్తూ..
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
కాంగ్రెస్ ఖాతాలోనే పెద్దపల్లి


