అభివృద్ధి బాధ్యత నాదే.. | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి బాధ్యత నాదే..

Feb 9 2026 8:13 AM | Updated on Feb 9 2026 8:13 AM

అభివృ

అభివృద్ధి బాధ్యత నాదే..

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మూడోవార్డు నుంచి మొలుగూరి కమల్‌, ఐదోవార్డు నుంచి గుజ్జుల కుమార్‌, పదోవార్డు నుంచి అక్కపల్లి సుజాత–క్రాంతికుమార్‌, 11వ వార్డు నుంచి పూదరి అ నూష–మహేందర్‌, 19వ వార్డు నుంచి నల్లాల ప ద్మ, 20వ వార్డు నుంచి బండి రమ్యకృష్ణ, 22వ వా ర్డు నుంచి ఉప్పు స్వరూప–రాజు, 25వ వార్డు నుంచి బూత్కూరి జానవి, 26వ వార్డు నుంచి సుధమల్ల అమ్రేష్‌, 30వ వార్డు నుంచి సాజిదా భాను తదితర కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ఆదివా రం ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఓటర్లు తీసుకుంటే, పట్టణాన్ని సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసేబాధ్యతను తాను భుజాన వేసుకుంటానన్నారు. అత్యధిక నిధులు మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో చేతిగుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

అభివృద్ధి బాధ్యత నాదే..1
1/1

అభివృద్ధి బాధ్యత నాదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement