కిస్సా కుర్సీ కా
కరీంనగర్ బల్దియా పీఠంపై ఉత్కంఠ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్‌ఎస్ దోస్తీ 15వ డివిజన్ కార్పొరేటర్ ఇంటి ఎదుట హైడ్రామా మెట్‌పల్లి, రాయికల్‌లోనూ హస్తం, కారు స్నేహం జమ్మికుంటలో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ చెక్ నేడు బలపరీక్షల్లో తేలిపోనున్న పార్టీల బలాబలాలు ఇండిపెండెంట్లకు రూ.2 కోట్లు, ఫార్చునర్ కారు ఆఫర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియాలో నా టకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్ సాధించామని, తమకు నలుగురు స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్స్‌ఆఫీషియో ఓటు కింద ఎంపీ ఉన్నారని.. మొత్తం 35 సీట్ల బలం ఉందని భా వించినప్పటికీ రాత్రికి రాత్రి పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్09, మజ్లిస్03, ఏఐఎఫ్‌బీ02, స్వతంత్రులు04, ఎక్స్ అఫీషియో 02 (ఇద్దరు ఎమ్మెల్యేలు)తో కలిపి తమకు 34 బలముందని చెప్పిన కాంగ్రెస్.. తెల్లవారే సరికి బీజేపీ శిబిరంలో ఉన్న కార్పొరేటర్ విప్పల సాయిజ్యోతిని తమవైపు తిప్పుకుని ఆ బలాన్ని 35కు పెంచుకుంది. ఈ సంఖ్య పెంచడానికి సీఎం కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు వరకు అంతా పర్యవేక్షించాల్సి వచ్చింది.
రోజంతా హైడ్రామా
15 డివిజన్ నుంచి ఏఐఎఫ్‌బీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికై న విప్పల సాయిజ్యోతి తొలుత బీజేపీలో చేరి ఆదివారం సాయంత్రం నాటికి కాంగ్రెస్ గూటికి చేరింది. ఆమె పార్టీ మారడం వెనక సీఎం కార్యాలయంతోపాటు మంత్రులు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు కృషి ఎంతో ఉంది. ఆదివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయిజ్యోతి తాము చెప్పినట్లుగా ఓటేయాలంటూ ఏఐఎఫ్‌బీ నాయకులు ఆమె ఇంటికి విప్ నోటీసు అంటించారు. ఆమెతో కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారని తెలిసి బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. బీజేపీలో చేరాక పార్టీ ఎలా మారతారంటూ నినాదాలు చేశారు. భారీ బందోబస్తు మధ్య సాయిజ్యోతిని హైదరాబాద్‌లోని కాంగ్రెస్ శిబిరానికి తరలించగా, అక్కడ ఆమె మరో కార్పొరేటర్ బొట్ల శ్యామల, ఇండిపెండెంట్ కొమురయ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ కూటమి బలం 35కు చేరుకుంది. మేయర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థా లేక ఇండిపెండెంట్‌గా ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతారా? అన్నది ఉత్కంఠగా మారింది.
ఇండిపెండెంట్ల జోరు..!
హంగ్ మున్సిపాలిటీల్లో స్వతంత్ర కౌన్సిలర్లు, కా ర్పొరేటర్ల పంట పండింది. వీరి మద్దతు కీలకమవడంతో పార్టీలు ఒక్కొక్కరికి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాయి. కరీంనగర్ లాంటిచోట డబ్బుతోపాటు ఫార్చునర్ కారు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటే వీరి డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి హంగ్ మున్సిపాలిటీల్లో స్వతంత్రులతో బేరసారాలు రూ.కోట్లకు చేరాయి.


