స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత | - | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత

Feb 10 2026 7:18 AM | Updated on Feb 10 2026 7:18 AM

స్ట్ర

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత

గోదావరిఖని: స్థానిక డిగ్రీకళాలలోని స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భ ద్రత చేపట్టాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి సూ చించారు. స్థానిక సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల ఆవరణలోని రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్‌రూ మ్‌, కౌంటింగ్‌ కేంద్రాలను ఆయన సోమవా రం తనిఖీ చేశారు. బ్యాలెట్‌ బాక్స్‌ల పంపిణీ, స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రత, సీసీ కెమెరాల ఏ ర్పాటు తదితర అంశాలపై నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశాలు జారీచేశారు. ఏసీపీ ర మేశ్‌, సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు.

ఎన్నికలకు గట్టి బందోబస్తు

సుల్తానాబాద్‌రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికలకు ప టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీసీపీ రాంరెడ్డి అన్నారు. పూసాల జెడ్పీహెచ్‌ఎస్‌, గడిమహెల్‌ బాలికల జెడ్పీ హైస్కూల్‌లోని సమస్యాత్మాక పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

గని కార్మికుల నిరసన

గోదావరిఖని: తమపై మహిళా కార్మికురాలు దురుసుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ ర్జీ–1 ఏరియా జీడీకే–1వ గనిపై సింగరేణి కా ర్మికులు సోమవారం నిరసన తెలిపారు. సుమా రు 3గంటల పాటు గనిపై బైఠాయించి కార్మికు రాలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధ్యురాలిపై చర్యతీసుకుంటే తప్ప ఆందోళన విరమించేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నా రు. జీఎం వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్‌ చే శారు. చివరకు జీఎం హామీతో కార్మికులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు.

స్విమ్మింగ్‌లో గోల్డ్‌మెడల్‌

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో చేపట్టిన జిల్లాస్థా యి సీఎం కప్‌ స్విమ్మింగ్‌ పోటీలు సోమవారం ముగిశాయి. అంతర్గాం జెడ్పీహెచ్‌ఎస్‌ పీడీ శో భారాణి, స్విమ్మింగ్‌ కోచ్‌ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. 30 మంది క్రీడాకారు లు హాజరయ్యారు. లింగాపూర్‌ మోడల్‌ స్కూ ల్‌ పదోతరగతి విద్యార్థి కట్కూరి విఘ్నదీప్‌ బ్యాక్‌ స్ట్రోక్‌ 100 మీటర్లలో గోల్డ్‌ మెడల్‌ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. శో భారాణి, కోచ్‌ కృష్ణమూర్తి విద్యార్థిని అభినందించారు. గ్రూప్‌–1 ఫ్రీస్టైల్‌ 100 మీటర్లలో కె. బాలాజీ ప్రథమ, ఎం.అర్జున్‌ ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. బటర్‌ఫ్లై 100 మీటర్ల విభాగంలో ఎం.అర్జున్‌ ప్రథమ, కె.ప్రణీత్‌ ద్వితీయ స్థానంలో నిలిచారు. పీఈటీలు మౌనిక, నిర్మల, అంజలి పాల్గొన్నారని జిల్లా యువజ న, క్రీడాధికారి సురేశ్‌ తెలిపారు.

ప్రణాళికతో చదవాలి

పెద్దపల్లి: పదో తరగతి విద్యార్థులు ప్రణాళిక తో చదివితే విజయం సొంతమవుతుందని జి ల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి రవీందర్‌ అన్నారు. ప్రభుత్వ షెడ్యూల్డ్‌ కులాల వ సతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు జి ల్లా కేంద్రంలో సోమవారం ప్రేరణ అవగాహన తరగతులు నిర్వహించారు. టెన్త్‌లో వందశా తం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. డీఈవో శా రద మాట్లాడారు. ప్రతినిధులు శ్రావణ్‌కుమా ర్‌, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ,7,599

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,599 ధర నమోదైందని మార్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,021, సగటున రూ.7,300గా ధర ఉందన్నారు. 1,118 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.

రూ.50కోట్లతో కొత్తశోభ

సుల్తానాబాద్‌ రూరల్‌: సుల్తానాబాద్‌ మున్సిప ల్‌ను మరో రూ.50కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచా ర ముగింపు ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత 1
1/3

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత 2
2/3

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత 3
3/3

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement