8న కరీంనగర్‌లో ఐటీ కెరీర్‌ గైడెన్స్‌ ప్రోగ్రాం | - | Sakshi
Sakshi News home page

8న కరీంనగర్‌లో ఐటీ కెరీర్‌ గైడెన్స్‌ ప్రోగ్రాం

Feb 7 2026 2:58 PM | Updated on Feb 7 2026 2:58 PM

8న కర

8న కరీంనగర్‌లో ఐటీ కెరీర్‌ గైడెన్స్‌ ప్రోగ్రాం

కరీంనగర్‌: యువతకు ఐటీరంగంపై అవగాహ న కల్పించేందుకు కోడింగ్‌ ట్యూటర్‌ ఆధ్వర్యంలో ఐటీ జాబ్‌మేళా, ఇంటర్న్‌షిష్‌, కెరీర్‌ గైడెన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈనెల 8న ఆదివారం ఉద యం 10 గంటలకు, కరీంనగర్‌లోని శ్వేత హో టల్‌లో కార్యక్రమం ఉంటుంది. ఐటీ రంగంలో ప్రస్తుత అవకాశాలు, కంపెనీలు ఏ నైపుణ్యాల ను ఆశిస్తున్నాయి, గ్రాడ్యుయేషన్‌ తర్వాత యు వత ఎలా సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి అడుగుపెట్టవచ్చు.. ఇంటర్న్‌షిప్‌ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయనే విషయాలను ఫణిరాజ్‌ జాలిగామ వివరించనున్నారు. డిగ్రీ/ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్ని స్తున్న వారికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. హాజరయ్యేవారు 89888 87333 నంబర్‌కి ఫోన్‌చేసి తప్పనిసరిగా రిజి స్టర్‌ అవ్వాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ చేసిన వారికే ప్రవేశం కల్పించబడుతుందన్నారు.

రెబల్స్‌పై చర్యలకు సిద్ధం?

గోదావరిఖని: అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా బరిలో ఉన్న, ప్రచారం చేస్తున్న వారిపై ఆ పార్టీ అధిష్టానం చర్యలకు సిద్ధమైంది. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్‌ వేసి, పార్టీ పేరుతో ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుని.. అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. రెబ ల్‌ అభ్యర్థులు, వారికి మద్దతుగా ప్రచారం చే స్తున్న నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణ యం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

క్వింటాల్‌ పత్తి రూ.7,716

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,716 ధర పలికిందని మార్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.6,011, సగటు రూ.7,411గా నమోదు అయిందని పేర్కొన్నారు. 1,094 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.

ఉద్యోగులకు మినహాయింపు

గోదావరిఖని: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11న ఉద్యోగులకు మినహాయింపు ఇ చ్చేందుకు సింగరేణి సీఆర్‌పీ/పీఈఆర్‌/ఐఆర్‌/119 పేరిట శుక్రవారం ఆ దేశాలు జారీ చే సింది. మొదటి, జనరల్‌ షిఫ్ట్‌ కార్మికులకు షిప్ట్‌ చివరి సమయానికి రెండు గంటల మినహాయింపు ఇచ్చారు. సత్తుపల్లి, ఆర్జీ–1,2,3, భూ పాలపల్లి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌, మందమర్రి ఏరియాల ఉద్యోగులకు ఈసర్క్యులర్‌ వర్తిస్తుందని యాజమాన్యం పేర్కొంది.

అందరూ ఓటు వేయాలి

పెద్దపల్లిరూరల్‌: అర్హులైన వారందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినిగించుకోవాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాలను శుక్రవారం సీపీ పరిశీలించారు. ఎన్నికల బందోబస్తుపై డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణకు పలు సూచనలిచ్చారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించి చా క్లెట్లు అందించారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై లక్ష్మణ్‌రావు తదితరులు ఉన్నారు.

పశుసంరక్షణకే వైద్యశిబిరాలు

మంథనిరూరల్‌: పాడి పశువుల సంరక్షణకే ప్ర త్యేక వైద్య శిబిరాలు చేపట్టామని జిల్లా పశువై ద్యాఽధికారి విజయభాస్కర్‌ అన్నారు. సిరిపు రం శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పశువైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. పశువులు వ్యా ధు బారినపడకుండా వ్యాధి నిరోధక టీకాలు, మందులు వేస్తున్నామన్నారు. సర్పంచ్‌ గోదారి లక్ష్మి, ఉపసర్పంచ్‌ ఈసంపల్లి నారాయణ, గో పాలమిత్రలు పానుగంటి సంజీవ్‌కుమార్‌, కొండయ్య, రామకృష్ణ, మల్లేశ్‌ పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

మంథని: పట్టణంలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను డీసీపీ రామ్‌రెడ్డి, ఏసీపీ రమేశ్‌ శుక్రవారం తనిఖీ చేశారు. బాలికల హైస్కూల్‌, బో యిన్‌పేట ప్రైమరీ స్కూల్‌ను పరిశీలించారు.

జీరో పెండెన్సీ లక్ష్యం

రామగిరి(మంథని): జీరో పెండెన్సీ లక్ష్యంతో పనిచేయాలని రామగుండం రీజియన్‌ సీఎంపీఎఫ్‌ కమిషనర్లు హరిపచౌరి, కె.గోవర్ధన్‌ సూచించారు. ఆర్జీ–3 జీఎం కార్యాలయంలో ప్రయాస్‌ ఆరో షెడ్యూల్‌పై శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు అధికా రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

8న కరీంనగర్‌లో   ఐటీ కెరీర్‌ గైడెన్స్‌ ప్రోగ్రాం
1
1/1

8న కరీంనగర్‌లో ఐటీ కెరీర్‌ గైడెన్స్‌ ప్రోగ్రాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement