రైల్వేస్టేషన్లలో తనిఖీలు
రామగుండం/పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్ బుధవారం రామగుండం, పెద్దపల్లి రైల్వే స్టేషన్లు తనిఖీ చేశారు. అమృత్ భారత్ పథకం ద్వారా చేపట్టిన రామగుండం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఏర్పాట్లపై కసరత్తు చేసేందుకు ఆయన పర్యటించినట్లు అ ధికారులు తెలిపారు. ఈనెల 15న రైల్వేస్టేషన్ ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నా.. అ దేరోజు మహాశివరాత్రి ఉండడంతో వాయిదా వేసే అవకాశం ఉంది. కాగా, స్వర్ణజయంతి (12643/44), వెన్‌గంగా బైవీక్లి(12251/52) సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించేందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం ఎగ్జిక్యూటివ్ సభ్యులు జాన్‌వెస్లీ, దేవిసింగ్‌ఠాకూర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్, నాగరాజు పాల్గొన్నారు.
రైళ్లలో ప్రయాణికుల రద్దీ
రామగుండం: ఎన్నికల వేళ కా జీపేట–బల్హర్షా మధ్య నడిచే రైళ్ల న్నీ బుధవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయా యి. జనరల్ బో గీల్లో కనీసం కా లుమోపే పరిస్థి తి లేకుండాపో యింది. స్లీపర్ క్లాస్‌లోనూ సాధారణ ప్రయాణికులు ఎక్కారు. రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ బల్దియాల్లో ఎన్నికలు జరుగుతుండడంతో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీసంఖ్యలో తరలివచ్చా రు. మరోవైపు.. ఈనెల 14 వరకు మంచిర్యాల – మందమర్రి మధ్య రైల్వేట్రాక్ ఇంటర్ లాకింగ్ పనులు కొనసాగుతాయి. దీంతో రామగుండం వరకే ప్యాసింజర్ రైళ్లు నడిపిస్తున్నారు.
గోటితో తలంబ్రాలు ఒలిచిన భక్తులు
కమాన్‌పూర్(మంథని): స్థానిక శివాలయంలో బుధవారం గోటితో తలంబ్రాలు ఒలిచే కార్యక్రమం చేపట్టారు. భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన శ్రీభక్త రామదాసు భక్త మండలి తీసుకొచ్చిన ధాన్యాం గింజలను మహిళలు గోటితో ఒలిచి బియ్యాన్ని తీశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీసీతారామ కల్యాణంలో ఈ తలంబ్రాలుగా ఉపయోగిస్తారని భక్తులు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ
కోల్‌సిటీ(రామగుండం): జగిత్యాల, మంచిర్యా ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మున్సిపల్ ఎ న్నికల పర్యవేక్షణాధికారి, పురపాలన శాఖ జా యింట్ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి బుధవారం రామగుండం నగరంలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ కౌంటింగ్ ఏర్పాట్లు తదితర వివరాల గురించి వివరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్ పాల్గొన్నారు.
ఉత్తమ పంచాయతీలకు రాజ్యసభలో ప్రశంస
ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్‌పూర్ గ్రామాన్ని 2023 సంవత్సరానికి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేశారు. ఇటీవల పచ్చదనం, పారిశుధ్య పంచాయత్ అవార్డు అందజేశారు. దీంతో కేంద్రమంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ రాజ్యసభలో ఉత్తమ పంచాయతీలను ప్రశంసించారు. అదే సమయంలో రూ.50 లక్షల రివార్డును అందజేశారు. దేశవ్యాప్తంగా 2023 నుంచి 2025 వరకు వివిధ కేటగిరీల్లో ఉత్తమ జాతీయ అవార్డులు అందుకున్న పంచాయతీల పేర్లను మంత్రి ప్రకటించారు. ఉత్తమ పంచాయతీలను మిగతా పంచాయతీలు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
రైల్వేస్టేషన్లలో తనిఖీలు
రైల్వేస్టేషన్లలో తనిఖీలు
రైల్వేస్టేషన్లలో తనిఖీలు


