మహిళల రక్షణ కోసం షీటీంలు
జ్యోతినగర్: మహిళల రక్షణ కోసమే షీటీంలు పనిచేస్తాయని షీటీం సభ్యురాలు స్నేహలత అన్నారు. ఎన్టీపీసీ రామగుండం సింధూర కళాశాల రోడ్‌లోని బచ్‌పన్ స్కూల్‌లో షీటీమ్ ఇన్‌చార్జి లావణ్య ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు 63039 23700 నంబర్‌కు ఫోన్ చేసి సమస్య తెలియజేయాలని సూచించారు. షీటీమ్ సభ్యులు మౌనిక, సురేశ్, డైరెక్టర్స్ శ్రీధర్, లావణ్య, ప్రిన్సిపల్ ఆయేషా పాల్గొన్నారు.


