‘బుగ్గ’లో సీపీ పూజలు | - | Sakshi
Sakshi News home page

‘బుగ్గ’లో సీపీ పూజలు

Feb 16 2026 7:15 AM | Updated on Feb 16 2026 7:15 AM

‘బుగ్

‘బుగ్గ’లో సీపీ పూజలు

పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్‌ శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామిని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా కుటుంబ సమే తంగా ఆదివారం దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని నిత్యజలధారను సందర్శించి నీటిని తాగారు. ఆలయ కమిటీ సభ్యులు కమిషనర్‌ దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అయోధ్యసింగ్‌, బసంత్‌నగర్‌ సర్పంచ్‌ పర్శవేన శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ కట్టెకోల వేణుగోపాలరావు, గుండా రమేశ్‌, అట్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు సుభిక్షంగా ఉండాలి

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): శ్రీగోవిందమాంబ – వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులతో ప్రజ లు సుభిక్షంగా ఉండాలని మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ఆకాంక్షించారు. పాండవులగుట్టపైగల ఆలయంలో ఆదివారం శ్రీగోవిందమాంబ – వీరబ్రహ్మేంద్రస్వామి క ల్యాణం సందర్భంగా స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీబసవత్తుల రాజమౌళి ఆచార్యులు, రాంరెడ్డి, రావుల సత్యనారాయణచారి, మునీందర్‌, రవీంద్రాచారి, విరాట్‌ మౌళి, ముల్కల గోవర్ధనశాస్త్రి పాల్గొన్నారు.

ఓదెల మల్లన్నకు గంగాజలంతో అభిషేకం

ఓదెల(పెద్దపల్లి): మంథని మండలం బోయిని పేట గ్రామానికి చెందిన భక్తుడు తాత రవితేజ ఆదివారం గోదావరి నదీజలాలతో కాలినడకన ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధికి చేరుకున్నా రు. కడవల్లో తీసుకొచ్చిన గంగాజలాన్ని మల్లి కార్జునస్వామి అభిషేకం కోసం సమర్పించా రు. మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం వేలాల గ్రామ సమీపంలోని గోదావరి నదిలోంచి గంగాజాలను రవితేజ కుటుంబసభ్యులు తీసుకుని కావడితో సుమారు వంద కిలోమీర్ల మేర కాలినడకన ఓ దెల మల్లికార్జునస్వామి సన్నిధికి చేరుకున్నా రు. తమ తాతముత్తాతల నుంచి ఇది ఆచారం వస్తోందని రవితేజ తెలిపారు.

ఘనంగా సేవాలాల్‌ జయంతి

ఓదెల(పెద్దపల్లి): లంబాడితండాలో ఆదివా రం సంత్‌ సేవాలాల్‌ జయంతి నిర్వహించారు. డీసీపీ భూక్యా రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తండావాసులు వ్యసనాలకు దూ రంగా ఉండాలని, యువకులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలని డీసీపీ సూచించారు. నాయకులు గుగులోతు నిమ్మనాయక్‌, గుగులోతు లింగేశ్‌, రాములు యాదవ్‌, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై రమేశ్‌ పాల్గొన్నారు.

‘బుగ్గ’లో సీపీ పూజలు1
1/3

‘బుగ్గ’లో సీపీ పూజలు

‘బుగ్గ’లో సీపీ పూజలు2
2/3

‘బుగ్గ’లో సీపీ పూజలు

‘బుగ్గ’లో సీపీ పూజలు3
3/3

‘బుగ్గ’లో సీపీ పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement