జన బలమా.. ధన బలమా?
గోదావరిఖని: పోలింగ్ సమీపిస్తోంది. తమ పార్టీ అభ్యర్థులను ముఖ్య నేతలు ఓటర్లను అభ్యర్థిస్తున్నా రు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీ నుంచి ముఖ్య నేతలు, సింహం గుర్తుపై పోటీచేస్తున్న వారు ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు.
ఖర్చు తడిసి మోపెడు..
కొందరు అభ్యర్థులు తమ స్థాయిని బట్టి ధన ప్రవా హానికి తెరలేపాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మద్యం పంపిణీ చేయడంతోపాటు జనాలమద్దతు కూడా కూడగట్టుకుంటున్నారు.
ఐదేళ్లు సేవ చేసినా చేతులు తడపాల్సిందేనా?
ఐదేళ్లపాటు ప్రజాసేవ చేసినా ఇప్పుడు గెలవాలంటే మళ్లీ ఓటర్ల చేతులు తడపాల్సిందేనా? అని చాలామంది అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు డబ్బులు పంచితే గెలుస్తామని నమ్మితే.. మరికొందరు తమకు జనబలం ఉందని, ఎలాగైనా కుర్చీ దక్కుతుందని ధీమాతో ఉన్నారు.
మెజార్టీ స్థానాలపై కాంగ్రెస్ నజర్
కాంగ్రెస్ మేయర్ పీఠం కై వం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇందుకోసం 60 డివిజన్లలో మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నా లు చేస్తోంది. అభ్యర్థుల బలాబలాలు సేకరిస్తోంది. ఆశించిన మెజార్టీ రాకుంటే అనుసరించాల్సిన వ్యూ హాలపై కసరత్తు చేస్తోంది. మరోరెండు రోజుల్లో ఫలితాలపై అంచనా రానుండగా.. అభ్యర్థులు అందరూ తమ బలాబలాలపై ఫోకస్ పెట్టారు.
ఐదేళ్ల సేవకు ఓటర్ల మార్కులు


