రామగుండం.. రసవత్తరం | - | Sakshi
Sakshi News home page

రామగుండం.. రసవత్తరం

Feb 8 2026 4:22 AM | Updated on Feb 8 2026 4:22 AM

రామగు

రామగుండం.. రసవత్తరం

గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్‌ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోలింగ్‌కు కొద్దిరోజులే గడువు ఉంది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ఉధృతం చేశాయి. అధికార కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌, బీఆర్‌ఎస్‌ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, బీజేపీ నుంచి జాతీయ నేత ఎస్‌.కుమార్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి తదితరులు తమ అభ్యర్థులకు మద్దతుగా కార్యక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ‘నువ్వానేనా’ అంటున్నాయి.

నగరంలో 60 డివిజన్లు..

నగరంలో 60 డివిజన్లు ఉన్నాయి. ఎన్నికలు అన్నివర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి మహిళలు, పురుషు ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగానే ఉంది. మహిళతోపాటు పురుష ఓటర్లనూ ప్రస న్నం చేసుకోవడం కోసం అభ్యర్థులు ప్రత్యేక ప్ర ణాళికతో ముందుకెళ్తున్నారు.

సగం.. సగం..

రామగుండం నగరంలో 60 డివిజన్లు ఉండగా.. 1,83,049 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 91,578 మంది కాగా, 91,441 మంది పురుషులు, మరో 30మంది టాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. 60 డివిజన్లలో 27 డివిజన్లు మహిళలకు కేటాయించారు. దీంతో కార్పొరేటర్‌ సీటుకోసం మహిళలు కూడా భారీసంఖ్యలోనే పోటీపడుతున్నారు.

రిటైర్డ్‌ కార్మికుల ఓట్లపై నజర్‌

సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 34 డివిజన్లు కలిసి ఉన్నాయి. ప్రతీనెల కనీసం 20 మంది సింగరేణి కార్మికులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. వీరిలో కొందరు స్థానికంగానే నివాసం ఉంటున్నారు. మరికొందరు హైదరాబాద్‌లాంటి దూరప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రిటైర్డ్‌ కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. వివిధ కారణాల రీత్యా దూర ప్రాంతాల్లో స్థిరపడిన ఇలాంటి రిటైర్డ్‌ కార్మికులు, వారి కుటుంబాలను ఇక్కడకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకునేలా కొందరు అభ్యర్థులు తమ ప్రయత్నా లు ప్రారంభించారు. దూరప్రాంత ఓటర్ల రాకపోకలకు అయ్యే రవాణా, ఇతరత్రా ఖర్చులు భ రించేందుకు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు.

ట్రాన్స్‌జెండర్లు

ఆసక్తికరంగా రిటైర్డ్‌ కార్మికుల ఓట్లు

మహిళలు.. పురుషులూ సగం సగం..

రామగుండం.. రసవత్తరం1
1/1

రామగుండం.. రసవత్తరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement