అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్‌రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడుతోందని, అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని 23,4వ వార్డులో తాడూరి శ్రీమాన్, కొమ్ము సుధాకర్, సుల్తానాబాద్‌లోని 4, 11,12,13,14,15వ వార్డుల్లో బిరుదు రాధాకృష్ణ, కల్వల అంజలి, దున్నపోతుల లలిత, సిద్ధ తిరుపతి, వేగోళం పద్మ, గాదాసు మంజులకు మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, మార్కె ట్ కమిటీ చైర్మన్ ప్రకాష్‌రావు, ముడుసు సాంబిరెడ్డి, రమేశ్, సునిత, రాజేందర్ పాల్గొన్నారు.


