డబ్బు, మందు పంచలేదు
నేను ఆర్‌ఎంపీగా సేవలు అందించా. పదోవార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. డబ్బులు, మందు పంపిణీ చేయలేదు. నా మీద అభిమానంతోనే కౌన్సిలర్‌గా గెలిపించారు. ప్రచారం కోసం రూ.20 వేల వరకే ఖర్చు అయింది. వాల్‌రైటింగ్ ద్వారా ప్రచారం చేశా. రోడ్లు, వీధిలైట్లు డ్రైనేజీలు నిర్మించా. ప్రస్తుత కూరగాయల మార్కెట్ వద్ద డ్రైనేజీ నిర్మించింది మా హయాంలోనే. 2001లో సింగరేణిలో ఉద్యోగం వచ్చినా ఆంక్షలు లేవు. కౌన్సిలర్‌గా సేవలు అందించా.
– రేవెల్లి రాజయ్య, మాజీ కౌన్సిలర్
ఐదోవార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కౌన్సిలర్‌గా గెలుపొందా. పార్టీ కరపత్రాలు, జండాలు పంపించింది. 20 మందితో ప్రచారం చేశాం. వాల్ రైటింగ్, ఆటోకు మైకుపెట్టి మైక్‌లో మాట్లాడుతూ ప్రచారం చేశా. సుమారు రూ.25వేలే ఖర్చయింది. అప్పటివరకు రోడ్లకు నోచుకోని గ్రామాలకు రోడ్లు నిర్మించాం. వీధిలైట్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశాం. మేం వేసిన రోడ్లే ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నికలకు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి రావడంతో దూరంగా ఉంటున్నా.
– మామిడాల చంద్రయ్య, మాజీ కౌన్సిలర్
2004లో జరిగిన ఎన్నికల్లో 33వ వార్డు నుంచి ఎస్టీ రిజర్వేషన్‌తో గెలిచిన తొలి కౌన్సిలర్‌ను నేనే. అప్పుడు ఖర్చు కూడా తక్కువే. నేను గెలిచిన వార్డు చాలా పెద్దది. చాలాఅభివృద్ధి పనులు చేసేఅవకాశం దొరికింది. ఎన్టీపీసీ నిర్మాణానికి రాళ్లుమోసిన వలస కుటుంబాలకు అండగా నిలిచిన. పీకే రామయ్యకాలనీలో 664 ఇండ్లు పునరావాసం కోసం ప్రభుత్వ సహకారంతో ఇప్పించా. ప్రగతినగర్‌లో 360 పట్టాలు, అలేఖ్య థియేటర్ వద్ద 170 ఇళ్లు ఇప్పించా.
– కేతావర్ కృష్ణ, మాజీ కౌన్సిలర్
డబ్బు, మందు పంచలేదు
డబ్బు, మందు పంచలేదు


