చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
మెట్‌పల్లిరూరల్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెట్‌పల్లి మండలం వేంపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండలం ధర్మారంకుచెందిన దండె నర్సింహులు (46) కొన్నేళ్లుగా వేంపేటలో నివాసం ఉంటున్నాడు. పశువుల కాపరిగా ఉంటూ జీవనం సాగి స్తున్న నర్సింహులు.. సోమవారం సాయంత్రం గ్రామ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ తీగ సహాయంతో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తీగ తగిలి మృతి చెందాడు. నర్సి ంహులు భార్య నర్సు ఫిర్యాదు మేర కు కేసు నమో దు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం హ స్నాబాద్‌లో జనవరి 22న పెట్రోల్ పోసుకుని ఆ త్మహత్యాయత్నానికి పాల్పడిన అనగోని క్రాంతి కుమార్ (41) చికిత్స పొందుతూ మంగళవారం కరీంనగర్‌లో మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన క్రాంతికుమార్ హస్నాబాద్‌కు చెందిన మహిళను వి వాహం చేసుకున్నాడు. ఆర్నెళ్ల క్రితం అతని త మ్ముడు మృతిచెందడంతో అప్పటినుంచి మద్యానికి బానిసయ్యాడు. భార్య కోసమని గతనెల 22 న హస్నాబాద్ వచ్చాడు. భార్య లేకపోవడంతో తాగిన మైకంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒ ంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమని ంచిన అత్తింటివారు వెంటనే కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ మృతిచెందాడు. క్రాంతికుమార్ సో దరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ హెడ్‌కానిస్టేబుల్ రవీందర్ తెలిపారు.
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జి ల్లా జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన సా త్తూరి సందీప్(31) బైక్ అదుపుతప్పి పంట పొలాల్లో పడి మృతిచెందాడు. ఎస్సై రమేశ్ కథ నం ప్రకారం.. పెద్దపల్లిలోని ఓ ఫైనాన్స్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్న సందీప్.. రోజూ బైక్‌పై వెళ్లి వస్తుంటాడు. సోమవారం కూడా బైక్‌పై వెళ్లి సా యంత్రం తిరిగి వస్తున్నాడు. కొలనూర్ శివారులో కి రాగా బైక్ అదుపుతప్పి పొలాల్లో పడి గాయాల కు గురై మృతి చెందాడు. మంగళవారం ఉ దయం రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు స మాచారం అందించారు. మృతుడి తండ్రి మొండయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కొత్తపల్లి(కరీంనగర్): మండలంలో దొంగతనాల కు పాల్పడుతున్న ఐదుగురిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ తెలి పారు. కమాన్‌పూర్ గ్రామానికి చెందిన గిర్ర దేవేందర్ కుటుంబసభ్యులతో కలిసి రామడుగు మండలం గోలిరామయ్యపల్లికి వెళ్లారు. గమనించిన దొంగలు ఈ నెల 24వ తేదీన రాత్రి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.89వేల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడిచ్చిన ఫిర్యాదుతో సీసీ కెమరాలు, టెక్నాలజీని ఉపయోగించి దొంగల ను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడ్డ క మాన్‌పూర్ వడ్డెపల్లికి చెందిన సూర సీతారాం, తపాలా స్వామికుమార్, బంజారా కార్తీక్, చింతకుంటకు చెందిన చందా రాజు, కమాన్‌పూర్ కు చెందిన బోనాల శివను మంగళవారం అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల ను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సైలు సాంబమూర్తి, తిరుపతిని సీఐ అభినందించారు.


