మాది అవినీతి రహిత పాలన | - | Sakshi
Sakshi News home page

మాది అవినీతి రహిత పాలన

Feb 10 2026 7:18 AM | Updated on Feb 10 2026 7:18 AM

మాది

మాది అవినీతి రహిత పాలన

● పెద్దపల్లిలో ఐటీ పార్క్‌ ఏర్పాటు చేస్తాం ● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు, వేదికపై ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు తదితరులు, బైక్‌ ర్యాలీలో కాంగ్రెస్‌ శ్రేణులు

పెద్దపల్లిరూరల్‌/మంథని: కాంగ్రెస్‌ హయాంలోనే ఽఅవినీతికి ఆస్కారం లేకుండా ఆదర్శవంతమైన పా లన ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పెద్దపల్లిలో ఐటీ పార్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మంథనిలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో మంత్రి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో తామి చ్చిన హామీలు ఆచరణలో సాధ్యం కావని బీఆర్‌ఎస్‌ బద్నాం చేసినా ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామన్నారు. రెండేళ్లలోనే మంథని అభివృద్ధికి రూ.50 కోట్లు వెచ్చించినట్లు చెప్పా రు. కుల సంఘాల భవన నిర్మాణాలకు రూ.కోట్లు మంజూరు చేశామని ఆయన అన్నారు. పెద్దపల్లిలో ఆటోనగర్‌ పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ప్రజాధనాన్ని దోచుకోవడమే ధ్యేయంగా పనిచేసిన బీఆర్‌ఎస్‌ పాలనను తిరస్కరించి, కాంగ్రెస్‌ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మె ల్యే విజయరమణారావు మాట్లాడుతూ, పెద్దపల్లి రూపురేఖల్ని మార్చుతామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ భానుప్ర సాదరావు మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో మహిళా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి అధిత ఎన్నికల ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, పలువురు అభ్యర్థులు, కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

మాది అవినీతి రహిత పాలన1
1/2

మాది అవినీతి రహిత పాలన

మాది అవినీతి రహిత పాలన2
2/2

మాది అవినీతి రహిత పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement