సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి
జ్యోతినగర్: కేంద్రంలో పీఎం మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు నిరసనగా 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ ఉపేందర్ కోరారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ రోడ్‌లో ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చిలుక శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఇజ్జగిరి భూమయ్య, రాధారపు రాజమల్లయ్య, లక్ష్మ ణ్, పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.


