ఎన్నికలకు ఏర్పాట్లు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఈనెల 11న పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 60 డివిజన్లలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలించేందుకు శారదనగర్ శిశుమందిర్ స్కూల్‌లో పంపిణీ సెంటర్ ప్రారంభించారు. టెంట్లు, టే బుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే ఓట్ల లెక్కింపు కోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
లేబర్ కోడ్‌లు రద్దుచేయాలి
జ్యోతినగర్(రామగుండం): కేంద్రప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ అనుబంధ కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చి లుక శంకర్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ ఆటోన గర్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 12న చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. నాయకులు గుండు రాజన్న, దుర్గం రవీందర్, దండు రమేశ్, రాజు, నాగరాజు, మల్లేశ్, వసంత్, రాయమల్లు పాల్గొన్నారు.
వ్యాయామంతో ఆరోగ్యం
జ్యోతినగర్(రామగుండం): రోజూ వ్యాయా మం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. పర్మినెంట్ టౌన్‌షిప్ ఎకో పార్క్‌లో ఆదివారం నిర్వహించిన ఆరోగ్య మేళాలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. క్రమం తప్పకుండా యోగా, ఫిట్‌నెస్ ఆటలు ఆడాలని సూచించారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఉన్నతాధికారులు, అధికారులు, వివిధ యూనియన్ల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
నేను ఓటు వేశా
జ్యోతినగర్(రామగుండం): ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తాను ఓటుహక్కు వినియోగించుకున్నానని ఎన్టీపీసీ పోలీస్ కానిస్టేబుల్ అబ్దుల్ ఫహీద్ తెలిపారు. ఆదివారం ఎన్టీపీసీ టెంపర రీ టౌన్‌షిప్ ఉద్యోగ వికాస కేంద్రంలో ఏర్పా టు చేసిన పోస్టల్ బ్యాలెట్ సెంటర్‌లో తాను ఓటుహక్కు వినియోగించుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాలుపంచుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఓటుహక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్టీపీసీ పోస్టల్ బ్యాలెట్ సెంటర్‌లో కల్పించారు.
212 పోస్టల్ బ్యాలెట్లు నమోదు
పెద్దపల్లి: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం ఈనెల 7, 8వ తేదీల్లో పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో చేపట్టిన పోస్టల్ బ్యాలెట్‌లో 212 మంది ఉద్యోగులు తమఓటుహక్కు వినియోగించుకున్నారని మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్, రమేశ్ ఆదివారం తెలిపారు. పెద్దపల్లిలో 150, సుల్తానాబాద్‌లో 62 మంది ఓట్లు వేసినట్లు వారు వివరించారు.
వసతులు కల్పించాలి
కోల్‌సిటీ(రామగుండం): పోలింగ్ కేంద్రాల్లో వ సతులు కల్పనపై కమిషనర్ అరుణశ్రీ ఆదివా రం సమీక్షించారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌దీపాలు, చక్రాల కుర్చీలు తదితర వసతులు ఉండాలన్నారు. ఓటర్లకు సాయం చేసేందుకు హెల్ప్‌డెస్క్, వైద్యశిబిరంతోపాటు అవసరమైన సేవలు అందించడానికి వలంటీర్లను కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, ఆర్వో ఆంజనేయులు, డీఈ శాంతిస్వరూప్, ఏఈ జమీల్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు ఏర్పాట్లు
ఎన్నికలకు ఏర్పాట్లు
ఎన్నికలకు ఏర్పాట్లు
ఎన్నికలకు ఏర్పాట్లు


