బరిలో వీళ్లు.. దూరంగా వాళ్లు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు పోటీచేస్తున్నారు. ప్రస్తుత చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప ఎమ్మెల్యే విజయరమణారావు సూచనతో తన పదవికి రాజీనామా చేశారు. ఏడోవార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ జడల సురేందర్ 23వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడ్డారు. అయినా ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థిగా 23వ వార్డు నుంచి పోటీపడుతున్నారు. మరోవైపు.. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్లు ఎల్.రాజయ్య, మమతారెడ్డి ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. చైర్మన్ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించడంతో మమతారెడ్డి పోటీచేసేందుకు అవకాశం లేకుండాపోయింది. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎల్.రాజయ్య కూడా ఈసారి పోటీ చేయడంలేదు.
జడల సురేందర్
ఈర్ల స్వరూప
ఎల్.రాజయ్య
మమతారెడ్డి
బరిలో వీళ్లు.. దూరంగా వాళ్లు
బరిలో వీళ్లు.. దూరంగా వాళ్లు
బరిలో వీళ్లు.. దూరంగా వాళ్లు


