కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ
జ్యోతినగర్(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న నిర్వహించనున్న ఓట్లలెక్కింపు ప్రక్రియలో పాలుపంచుకునే సిబ్బందికి ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని కాకతీయ కల్యాణ మండపంలో సోమవారం శిక్షణ ఇచ్చారు. 72 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 144మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించగా.. వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ,, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్వో ఆంజనేయులు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ట్రెయినర్లు కేడం శ్రీనివాస్, జక్కం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


