
ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శశాంక్ సింగ్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
కేవలం 15 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 33 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే శశాంక్ తన ఇన్నింగ్స్‌లో కొట్టిన ఓ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. పంజాబ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మయాంక్ యాదవ్ నాలుగో బంతిని శశాంక్ సింగ్‌కు బ్యాక్-ఆఫ్-ఎ-లెంగ్త్ డెలివరీగా సంధించాడు.
ఆ డెలివరీని శశాంక్ సింగ్ డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్-లెగ్ మీదుగా 92 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. అతడి పవర్ దాటికి బంతి మైదానం బయట పడింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తున్న పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా అద్బుతమైన రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(91) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా.. శ్రేయస్ అయ్యర్(45), శశాంక్ సింగ్(33), ఇంగ్లిష్(30) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.
Fetch that one from the mountains! 🏔#ShashankSingh lights up Dharamsala with a monstrous six. Power-hitting at it's finest! 🤩
Watch the LIVE action in BHOJPURI ➡ https://t.co/Iz9KWvDwyp #IPLRace2Playoffs 👉 #PBKSvLSG | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star… pic.twitter.com/C24qxSp4lE— Star Sports (@StarSportsIndia) May 4, 2025