
PC: BCCI/IPL.com
IPL 2025 PBKS vs DC Live Updates:
పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దు
ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దు అయింది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు.
పంజాబ్ తొలి వికెట్ డౌన్..
ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన ఆర్య.. టి. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.1 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది.
ప్రియాన్ష్ ఆర్య హాఫ్ సెంచరీ
పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య హాఫ్ సెంచరీ సాధించాడు. ఆర్య 56 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 9 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. క్రీజులో ఆర్యతో పాటు ప్రభుసిమ్రాన్ సింగ్(45) ఉన్నారు.
6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 69/0
6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(42), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(26) ఉన్నారు.
2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 20/0
2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(12), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(3) ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..
ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరి కాసేపట్లో టాస్
అభిమానులు గుడ్ న్యూస్. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ 8:30 గంటలకు ప్రారంభం కానుంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో 8:00 గంటలకు టాస్ పడనుంది.
టాస్ మరింత ఆలస్యం..
ధర్మశాలలో ప్రస్తుతం వర్షం భారీగా కురుస్తోంది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది.
ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ప్రస్తుతం వర్షం ఆగినప్పటికి, మైదానాన్ని మాత్రం కవర్లతో కప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది.