చరిత్ర సృష్టించిన చాహల్‌.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా | Yuzvendra Chahal bags his second hat-trick in IPL | Sakshi
Sakshi News home page

IPL 2025: చరిత్ర సృష్టించిన చాహల్‌.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా

Apr 30 2025 9:57 PM | Updated on May 1 2025 1:03 PM

Yuzvendra Chahal bags his second hat-trick in IPL

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో  జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ హ్యాట్రిక్ వికెట్ల‌తో చెల‌రేగాడు. త‌న బౌలింగ్ కోటాలో తొలి రెండు ఓవ‌ర్ల‌లో భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న చాహ‌ల్‌ను పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తిరిగి 19వ ఓవ‌ర్ వేసేందుకు ఎటాక్‌లో తీసుకొచ్చాడు. 

ఓ ఓవ‌ర్‌లో చాహ‌ల్ అద్బుతం చేశాడు. తొలి బంతిని సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని సిక్స‌ర్‌గా మ‌ల‌చ‌గా.. అనంత‌రం రెండో బంతికి భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన హుడా మూడో బంతికి రెండు ప‌రుగులు తీశాడు.

 ఇక్క‌డ నుంచి చాహ‌ల్ మ్యాజిక్ మొద‌లైంది. నాలుగో బంతికి దీపక్ హుడా ఔట్ కాగా.. ఐదో బంతికి కాంబోజ్‌, ఆరో బంతికి నూర్ ఆహ్మ‌ద్ ఔట‌య్యాడు. దీంతో చాహ‌ల్ ఖాతాలో రెండో ఐపీఎల్ హ్యాట్రిక్ వ‌చ్చి చేరింది. ఓవరాల్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్‌..32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్ర‌మంలో చాహ‌ల్ పలు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

చాహ‌ల్ సాధించిన రికార్డులు ఇవే..
👉ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ త‌రపున హ్యాట్రిక్ వికెట్లు తీసిన నాలుగో బౌల‌ర్‌గా చాహ‌ల్ రికార్డుల‌కెక్కాడు. ఈ జాబితాలో దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, సామ్ కుర్రాన్ ఉన్నారు.

👉ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై హ్యాట్రిక్ వికెట్లు ప‌డ‌గొట్టిన తొలి బౌల‌ర్‌గా చాహ‌ల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్‌గా కూడా ఈ ఫీట్ సాధించలేకపోయాడు.

👉ఐపీఎల్‌లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్‌గా యువరాజ్ సింగ్ రికార్డును చాహల్ సమం చేశాడు. యువీ, చాహల్ రెండు సార్లు హ్యాట్రిక్ సాధించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో అమిత్ మిశ్రా(3) తొలి స్ధానంలో ఉన్నాడు.

👉అదేవిధంగా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 4 వికెట్ల హాల్ సాధించిన బౌలర్‌గా చాహల్ నిలిచాడు. చాహల్ ఇప్పటివరకు 9 సార్లు నాలుగుకు పైగా వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సునీల్ నరైన్‌(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో నరైన్ రికార్డును చాహల్ బ్రేక్ చేశాడు.
చ‌ద‌వండి: #Glenn Maxwell: ఐపీఎల్‌-2025 నుంచి మాక్స్‌వెల్ ఔట్‌..

 

Advertisement
 
Advertisement
Advertisement