IPL 2025 Final: అన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు 'ఆ జట్టే' ఛాంపియన్‌ అని అంటున్నాయి..! | RCB Or PBKS, Who Will Win IPL 2025 Final, All AI Platforms Pick Same Team | Sakshi
Sakshi News home page

IPL 2025 Final: అన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు 'ఆ జట్టే' ఛాంపియన్‌ అని అంటున్నాయి..!

Jun 3 2025 6:12 PM | Updated on Jun 3 2025 6:37 PM

RCB Or PBKS, Who Will Win IPL 2025 Final, All AI Platforms Pick Same Team

Photo Courtesy: BCCI

ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌​ జట్ల మధ్య ఐపీఎల్‌ 2025 సీజన్‌ ఫైనల్‌ ఇవాళ (జూన్‌ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో విజేతపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ప్రదర్శనల ప్రకారం ఈ సీజన్‌లో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలానా జట్టు గెలుస్తుందని అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌లు జరగగా.. ఆర్సీబీ 2, పంజాబ్‌ ఓ మ్యాచ్‌లో గెలిచాయి. దీని ఆధారంగా ఆర్సీబీకే స్వల్ప ఎడ్జ్‌ ఉందని చెప్పవచ్చు.

మానవమాత్రుల అంచనాలను పక్కన పెడితే.. కృత్రిమ మేధ (Artificial Intelligence, AI) ఏం చెబుతుందో చూద్దాం. ప్రచుర్యంలో ఉన్న టాప్‌ ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ఐపీఎల్‌ 2025 విజేత ఎవరని అడగగా.. దాదాపు అన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు (గ్రోక్, జెమిని, ఛాట్‌జీపీటీ) ముక్తకంఠంతో ఆర్సీబీని విజేతగా తేల్చాయి.

X GROK: అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, RCB ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ పంజాబ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ను 101 పరుగులకే ఆలౌట్ చేసి, 60 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఆర్సీబీ ఫైనల్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. జోష్ హాజిల్‌వుడ్ (11 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు), సుయాష్ శర్మ నేతృత్వంలోని RCB బౌలింగ్ అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ (55.81 సగటుతో 614 పరుగులు), ఫిల్ సాల్ట్ విస్ఫోటకమైన ఫామ్‌లో ఉన్నారు.

అహ్మదాబాద్‌లో RCB యొక్క చారిత్రక ప్రదర్శన (మొదట బ్యాటింగ్ చేసిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచింది) మరియు ఒత్తిడిలో సామర్థ్యం వారికే స్వల్ప ఎడ్జ్‌ను ఇస్తాయి. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ వంటి నిపుణులు కూడా RCBకి మద్దతు ఇచ్చారు. వార్నర్ హాజిల్‌వుడ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంచనా వేశారు.

అయితే, క్వాలిఫయర్ 2లో పంజాబ్‌ ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తమను తక్కువ అంచనా వేయొద్దని అలర్ట్‌ చేస్తుంది. ఆ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి ఒంటిచేత్తో పంజాబ్‌ను గెలిపించాడు. కైల్ జేమిసన్, యుజ్వేంద్ర చహల్ వంటి బౌలర్లతో పంజాబ్‌ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. అయితే క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ చేతిలో పతనం ఒత్తిడిలో  పంజాబ్‌ బలహీనతను సూచిస్తుంది.

ప్రస్తుత ఫామ్, సమతుల్య జట్టు, ఈ సీజన్‌లో వారి జోరును పరిగణనలోకి తీసుకుంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2025 ఫైనల్‌ను గెలుస్తుందని అంచనా. ఆర్సీబీ బ్యాటింగ్‌ లోతు మరియు పెద్ద మ్యాచ్‌లలో అనుభవం వారిని ఛాంపియన్లుగా చేస్తాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement